ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
కణ్ణదాసన్ - అణ్ణా---అణ్ణాదురై అతి నిరాడంబరమనిషి. ఓరోజు చిరిగిన చొక్కా వేసుకుని ఏదో రాసుకుంటున్నారు. అప్పుడక్కడికి వెళ్ళిన తమిళ కవికణ్ణదాసన్ "ఏమిటి అణ్ణాగారు? మీరిలా చినిగిన చొక్కా వేసుకోవడమేంటీ? ఇటివ్వండి అర డజన్ చొక్కాలు కొత్తవి కుట్టిస్తాను" అని బలవంతంగా అణ్ణాదురై వేసుకున్న చొక్కా తీసుకెళ్ళారు కొలత కోసం.నెల రోజులైంది.అణ్ణాదురై మళ్ళీ పుస్తకం చదువుకుంటున్న వేళ కణ్ణదాసన్ ఆయన దగ్గరకు వెళ్ళారు. అప్పుడు అణ్ణాదురై ఒంటిమీద చొక్కాలేదు.కణ్ణదాసన్ "ఏమిటిది చొక్క వేసుకోకుండా కూర్చున్నారేమిటి?" అని అడిగారు. అప్పుడు అణ్ణాదురై ఓ చిన్ననవ్వు నవ్వి "ఏముందీ ఉన్న ఒక్క చొక్కా కొలత కోసం తీసుకెళ్ళావు. కొత్తవి కుట్టిస్తానన్నావు. ఇప్పటివరకూ నువ్వివ.వలేదుగా. అందుకే ఇలా చొక్కా లేకుండా ఉన్నా" అన్నారు.అప్పుడు మతిమరపు కణ్ణదాసన్ కి విషయం గుర్తుకొచ్చింది. అరెరె తాను కొత్త చొక్కాలిస్తానన్నాను కదా అనే విషయం గుర్తుకొచ్చి అప్పటికప్పుడు వెళ్ళి ఆరు పట్టు చొక్కొలు అణ్ణాదురైకి ఇచ్చారు కణ్ణదాసన్. కణ్ణదాసన్ కున్న మతిమరుపు విషయాన్ని చెప్తూ ఒక తమిళ ప్రముఖుడు చెప్పిన మాటలివి.- జయా
August 17, 2020 • T. VEDANTA SURY • Memories