ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
కథ ఇప్పుడే మొదలైంది... అసలేం జరుగుతుందో అర్థమవ్వడం లేదు మూతికి మాస్కులంటే మనిషికి గుర్తెరుగుతలేం కానీ నడకను బట్టి మనోడే అనిపిస్తుంది పిలిచి ముట్టుకున్న, ముచ్చటెట్టాలన్నా క్వారంటేన్ గుర్తోస్తుంది ఐనా కరోనాను గుంపుల్లో కమ్మేసినారు ఇప్పుడు అందరికీ అనుమానమే కలుగుతుంది ఐనా తొవ్వ మాత్రం ఆగుతలేదు ఏ గల్లి కెల్లినా గాల్లకొచ్చింది గీళ్ళకొచ్చిందన్న ముచ్చటే మతలాబేందని ఆరాతీయబోతే మన చుట్టూ తిరోగిందనవట్రి గజగజ వణికి ఇంట్లో కూసుంటే ఏంలాభం ఘడియకోపారి ఎవరో వచ్చి ముచ్చట పెట్టవట్రి వచ్చేదాగుతదా అని సుద్దులు పల్కవట్రి ఇగ వీళ్ళు మారరూ! పగోనికన్నా ప్రమాదమున్నరు! పనికిమాలిన ముచ్చట్లకు మూతులు సాపుతెట్లా కంటికి కనిపించని కరోనాకు మందు పుట్టేదాక ఆగట్లేరా యాడ జూసినా గుంపులు గుంపులు జనాలు తప్పుతీత్తరని లగ్గానికి తప్పక పోవట్రి చావునాడు తక్కువే గాని దినవారం దాకా పోటీ దావతులే ఎక్కడేముందో బయటకొత్తలేదు గానీ ఇప్పుడు మాత్రం కరోనా చుట్టుముట్టేసింది దాచుకుంటే దాగేదు కానీ దండిగా అంటుకుంటది ఇక కథ ఇప్పుడే మొదలైంది వారానికే దేశంలో లక్ష దాటుతుంది పోటాపోటీగా ప్రపంచంలోనే మొదటికి పోతదేమో మొదట్ల లాక్ డౌన్ పెట్టకుంటే కుక్కలు చింపిన విస్తరౌ మన బతుకులు ఐనా ఇకనైనా కాస్త గుబులు గుబులుగానే బతుకుదాం బౌతిక దూరం పాటిస్తూ, వనరులు సమకూర్చుకుని స్వీయ నియంత్రణతోనే కలోగంజో తాగి ఇంట్లుందాం -ఉండ్రాళ్ళ రాజేశం
June 29, 2020 • T. VEDANTA SURY • Poem