ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
కమ్మని కల: -:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
November 9, 2020 • T. VEDANTA SURY • Poem

మబ్బుల పరుపు పరుచుకొని
చందమామను దిండుచేసుకొని
చిన్ని పిట్టలు రాగంతీయగ
చిన్న జంతువులు నాట్యంచేయగ
చెట్లకొమ్మలు ఊయలలూపగ
పిల్లతెమ్మెరలు జోలలుపాడగ
బజ్జో బజ్జో మాపాపా
కమ్మని కలలే కనవమ్మా
కలలో నువ్వే మా రాణీ !!