ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
కరోనా కరోనా ఛలోనా --కళావతి కందగట్ల --హైదరాబాద్--9948263004
October 4, 2020 • T. VEDANTA SURY • Poem

 పిలవని పేరంటలా 
 వచ్చింది
 తిష్ట వేసి కూర్చుంది
 పలు దేశాలను పలకరించిన 
 ప్రమాదకారి కరోనా

 ఆనువంత ఉన్న జీవి 
 అగ్రరాజ్యాల ను సైతం
 గడగడలాడించింది
 అక్షరాల లక్షల మందిని
 బలితీసుకుంది కరోనా

 ఎదిరించి నిలువలేము 
 దానిని  
 నివారణ ఒక్కటే మార్గము
 సామాజిక దూరం అనివార్యం
 పరిశుభ్రతే  పరమావధి

ఆరోగ్య సూత్రాలను 
కచ్చితంగా పాటిస్తే
తోకముడిచి పారిపోదా
కలవర పెడుతున్న కరోనా
కరోనా కరోనా  ఛలోనా