ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
కరోనా కహానీ----సాగర్ రెడ్డి--చెన్నై
October 30, 2020 • T. VEDANTA SURY • Poem

నోరుతిరగనిపదం
శానిటైజర్ ఆనాడు
ప్రతీఇంట నిత్యావసరమై
తిష్టవేసిన అత్యవసరం
ఈనాడు!!

మాస్క్ సహిత 
వదనాన్ని
అనుమానస్పద చూపులతో పరికించి
ఆమడదూరమైన 
ఆనాటి జనం-
మాస్క్ రహిత మైతే
బారెడు దూరం జరిగే
పరిస్దితి దాపురించె!!

తుమ్మితే చిరంజీవ
అని సంతోషపడే
రోజులు పోయి-
తుమ్మినవాడిని
తరిమే రోజులు
ఆసన్నమాయే!!

కౌగిలింతలోనే ఆప్యాయతను
వెతికిన మనుషులేరి?
కరచాలనంలో 
ఆత్మీయతను
చవిచూసిన రోజులెక్కడ?

వేసవికాలం
మొత్తం ఆక్రమించి-
వర్షాకాలంలోనూ
తన వికట్టహాసంతో
జనులగుండెల్లో
తిష్టవేసి-
శీతాకాలాన్ని
సందేహాస్పదంగా 
చూపుతున్న
కరోనా కలకలం
తరలి పోయేనా?
జనాలకుపట్టిన
భీతి విరగడయ్యేనా??