ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
కరోనా బూచి: రామ్మోహన్ రావు తుమ్మూరి
October 13, 2020 • T. VEDANTA SURY • Poem

విశ్వ వ్యాప్తమ్ము నేడు ఈ విషపు బూచి

దీని దొలగింప నొక్కటే తీరు గలదు

ఒండొరుల మధ్య దూరము ఒద్దికగను

ఇల్లు గదలకనుండుట ఇలకు సుఖము

 

కరములే రోగవ్యాప్తికి కారణములు

కడుగుకొనవలయు సబ్బుతో క్రమము విడక

కరస్పర్షలు వలదింక కరము మోడ్చి

నమస్కారము చేయుటే క్షేమకరము

 

ఆంక్షలన్నియునారోగ్య కాంక్ష తోడ

ఏలికలు జనుల మేలుకై ఏర్పరింప

త్రోసిపుచ్చుట తగునొకో తోడుపడవొ

తెచ్చుకొనుటేల ముప్పును తెలివి మాలి

 

ఇంటిలోనుండుటొక్కటే ఇపుడు తెరవు

కంటి రెప్పగ కాపాడుకుంటె మేలు

బతికి యుండుట ఒక్కటే  ప్రథమ లక్ష్య

మంతకన్నను మిక్కిలి అదియె నిజము