ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
కర్మయోగి!!--కె ఎస్ అనంతాచార్య-- ఒక మౌనం మాట్లాడితే అనుభవం అడుగులు వేస్తే, తపస్సు నిష్కామమైతే అది పీవీ భారత రాజకీయ యవనికపై నిబద్ధ తా వర్ణ చిత్రం! ఆర్ధిక సంస్కరణల శక కర్త! దేశభద్రతకు చెరగని ముద్ర మానవ వనరుల రూప శిల్పి అపర చాణక్యుడు పదవులకై పాట్లు పడని పాముల పర్తి భారతీయతకు స్ఫూర్తి! పట్టాలెక్కలేని మైనార్టీ రైలును నడిపించిన మాంత్రికుడు లోపలి మనిషిలో లోతైన ప్రజ్ఞ అనువదించిన సహస్ర ఫణ్ తనలో బయటకు కనిపించని మణి భారత రాజకీయ సి సి టివి ఫుటేజీలో మొలకెత్తిన సంస్కరణల వంగడం! ఠీవి..పివి. ఒకదానికొకటి పూవు తావి
June 30, 2020 • T. VEDANTA SURY • Poem