ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
కలసొస్తే --కె ఎస్ అనంతాచార్య
October 1, 2020 • T. VEDANTA SURY • Poem

కాలం కలిసొస్తే నడిచే 
కొడుకు వస్తాడో లేదో కానీ అనుకూల పవనాలు వీచి పడి లేచే కెరటం 
అవుతావు!
చాయవాలా  కష్టం ఫలించి దేశాధినేత లై పగ్గాలు చేపట్టి  ప్రగతిరథాన్ని పరుగులు పెట్టిస్తున్నారు

 చిల్లి గవ్వ లేకున్నా భాష రాకున్నా కట్టు బాట్లు తెలియకున్నా  దృష్టి స్పష్టంగా ఉంటే కలిసొచ్చే విజయం కాళ్ళ ముందు సాగిలపడుతుంది!

పస్తులున్నప్పుడే ఆకలి విలువ 
వానలో,ఎండలో చలిలో తనువు తహ తహలాడి నప్పుడే విలాసం రుచి అవగతమవుతుంది !
కాయలు కాసిన భుజాలే  బాధ్యతల బరువులు మోస్తాయి!


అరికాలి చెప్పులు అరిగి రక్త ధారలు ప్రవహించినప్పుడే  సింహాసనం పాదాక్రాంత మౌతుంది

ఉన్నత చదువులు హుందాలతో పాటు కూసింత లౌక్యం ఉంటే  
ఎవరెస్టు పై జండాపాతే అవకాశం వెతుక్కుంటూ వస్తుంది

పేదరికమే ప్రేరణగా 
జీవిత కళాశాల లో
అనుభవం పాఠాలు నేర్చి ,
స్వశక్తి  అందుకొనే పురస్కారం

బతుకు బండిని 
లాగడానికి బక్కజీవి పడే తంటాల్లోంచి
కలిసొచ్చిన ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది

నిద్ర మత్తు వదిలి సోమరితనం  ఆవిరైనప్పుడు పొందే
కార్యసిద్ధి కలిసొచ్చే బుద్ధి బలం యశోధైర్యం, వాక్ పటుత్వం