ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
కళాకాంతికథ( బేతాళకథ)-- డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై -.పట్టువదలని విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకువచ్చి శవాన్ని ఆవహించి ఉన్న బేతాళుని బంధించి భుజానవేసుకుని మౌనంగా నడక సాగించాడు. శవం లోనిబేతాళుడు 'మహరాజా నీకార్యదీక్ష, పట్టుదల , ప్రశంసనీయం. ముక్తము,లోక్యము,వారధిమాల,పంచరత్నములు,నవరత్నములు, అవతారమాల,రుద్రమాల, భాస్కరమాల,మనుమాల,శశికళ,పురాణమాల,గాయత్రిమాల,నక్షత్రమాల,శతకము వంటి పద్యరత్నాలను ఆశువుగా చెప్పగలవు. కాలంగా ఉన్నసందేహం కళాకాంతి కథలా నీకు ప్రయాణ అలసట తెలియకుండా చెపుతాను విను......పూర్వం మహిరి అనేఊరి అగ్రాహారంలో అర్జునశర్మ అనే బ్రహ్మణుడు ఉండేవాడు.అతనికి అందాలరాశి అయిన కళాకాంతి అనే కుమార్తెఉంది. ఆమెకు వివాహప్రయత్నాలు ప్రారంభించగానే, ఒకరోజు ఆమెను వివాహం ఆడదలచి ,శూరుడు,మహాజ్ఞాని,కల్పనుడు అనే ముగ్గురు యువకులు ముందుకువచ్చి అర్జునశర్మను కలసారు.అలావారు మాట్లాడుతుండగా, పూతోటలో సాయంకాలం పూలు సేకరిస్తున్న కళాకాంతిని ఆకాశమార్గాన వచ్చినమాంత్రికుడు అందరూచూస్తుండగా తనమాయవిద్యతో రెప్పపాటుకాలంలో తీసుకెళ్లాడు.అది చూసిన అర్జునశర్మ విలపిస్తూ తనకుమార్తెను ఎవరు రక్షించగలరో వారికి ఇచ్చి వివాహం జరిపిస్తాను అన్నాడు.అక్కడ ఉన్నముగ్గురు యువకులలో మహాజ్ఞాని ఆరాక్షసుడు ఎక్కడ ఉన్నాడో తన జ్ఞానదృష్టితో తెలియజేసాడు.అదివిన్న కల్పకుడు తనవద్దనున్న మాయ ఉంగరాని శూరుడికి అందించి' దీన్ని ధరించి నువ్వు ఎక్కడకు వెళ్లాలంటే అక్కడకు క్షణకాలంలో వెళ్లగలవు'అన్నాడు.ఆఉంగరం ధరించి కత్తిచేతపట్టి మహాజ్ఞాని చెప్పిన ప్రదేశానికిచేరి,మాయావిని సంహరించి కళాకాంతిని ఆమె తండ్రికి అప్పగించాడు.అప్పటి వరకు కథచెపుతున్న బేతాళుడు'విక్రమార్కమహారాజా ఆముగ్గురు యువకులలో కళాకాంతిని వివాహం చేసుకోవడానికి ఎవరు అర్హులు.తెలిసిచెప్పక పోయావో తలపగిలి మరణిస్తావు.అన్నాడు.అందుకు విక్రమార్కుడు'బేతాళా మహాజ్ఞాని,కల్పనుడు,వారునేర్చిన విద్యను ప్రదర్శించారు.మనిషికి ఉండవలసిన ధైర్యం,శౌర్యం,వీరుడు అయిన శూరుడే ఆమెకుతగిన వరుడు.కనుక కళాకాంతిని శూరుడు వివాహం చెసుకోవడం న్యాయం'అన్నాడు.విక్రమార్కునికి మౌనభంగం కావడంతో శవంతో సహా బేతాళుడు మాయం అయ్యాడు. పట్టువదలని విక్రమార్కుడు బెతాళునికై వెనుతిరిగాడు.
August 2, 2020 • T. VEDANTA SURY • Story