ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
కళా రాధన!!--కె ఎస్ అనంతాచార్య
August 24, 2020 • T. VEDANTA SURY • Poem


లలిత కళారాధనలో
వెలిగే చిరుదివ్వెలెన్నో
భారతి పదసంపద లో
ఒదిగిన గువ్వలు
ఇదొక నిశ్శబ్ద సందర్భం 
కవిత్వమైనా,కళనైనా
వాట్సాప్ లోనుంచి
ప్రవహిస్తోంది
జూమ్ లో 
జుగల్బంది చేస్తోంది
అంతా గంభీరత
భయావహ సన్నివేశాలు
భీతావహ దృశ్యాలు
ధైర్యాన్ని,మనోధైర్యం
అందించేదే మహత్తర కళావిద్యాభ్యాసo
బాహ్యప్రపంచం సంఘటనల్లోంచి
బ్రహానంద స్థితి లోకి
తీసుకెళ్లే మాయల మరాఠీ
ప్రకృతి ప్రకోపించి
జీవి విలయ తాండవ మాడుతున్న వేళ
ఊరట నిచ్చేవి గంధర్వప్రసాదిత కళలు
వేదికలన్నీ క్వారంటయిన్లయి
కవులు,కళాకారులు
ఐసోలేషన్ అయినా
ఆన్ లైన్ శరణమై
కళాభరణమైంది
కన్నీటిలో కరిగి పోయేది కాదు కళ
అజరామరమై
హృదయ కోవెలలో
ఉదయించే పుష్పం
రోగనిరోధకతను పెంచుతూ ప్రశాoతతను పంచే
సంగీత సారస్వo
దారులు మూసుకు పోయిన కరోనాకాలంలో 
సృజనాత్మకతది ఎప్పుడూ
రసాత్మక శోధనే
కళారాధనంటే
కళ్లలో నించి
తొణికిసలాడే
రసాభి నివేశం