ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
కవితాత్మకథ--కె ఎస్ అనంతాచార్య.-- నానమ్మ కథలోని రాజకుమారుని రెక్కల గుర్రం నడక బావిలో పడ్డ సూది కోసం ఊ కొట్టడం మనసులో ముద్రించుకున్న ఊహాల మధురోహలు! దృశ్యమానం చేసిన మనోహర శిల్పమే వెండి తెరకు కళ్ళను అతికిస్తుంది! బతుకమ్మలా పేర్చబడి భావాలు కూర్చి న రసప్లావిత కవిత్వం! కథనoలో ప్రవేశించి ఆలోచనల్లో పయనించి,వాక్యాల్లో చిత్రాన్నాన్ని వండి వడ్డించడమే! పాత్రలన్నీ ఇంట్లొవే వ్యక్తిత్వాలన్ని సమాజ సంపదలే సంవేదనలన్నీ శీర్షికలై అభివ్యక్తీకరించిన రచయితదే నవ్యోక్తి రక్తి కట్టే మాటలన్నింటిని మూటగట్టి చక్కని భాషలో మడిచి హృద్యంగా నడిపించే కథనం బాలనాగమ్మ కథయే కావచ్చు బాల మేధస్సును వికసింప జేసే సృజనా తేజస్సు భూతకాలమంతా కథాకాలమైతే వాకిట్లో నిలచిన వర్తమానం భవిష్యత్ గల్పిక కథ కంచికి చేరుతుందో లేదో గాని పాఠకుల గుండెల్లో మేల్కొల్పు పాఠమవుతుంది పచ్చని పైర్ల మీద పాడే చిలకవుతుంది
August 15, 2020 • T. VEDANTA SURY • Poem