ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
కవిత్వమెందుకు--- బాలవర్ధిరాజు మల్లారం
September 11, 2020 • T. VEDANTA SURY • Poem

ఎన్నెన్నో అవస్థలున్న  ఈ వ్యవస్థలో...
అసలు  కవి కవిత్వమెందుకు రాస్తున్నట్టు?

తన పైత్యాన్ని అక్షరాల్లో కక్కడానికా?
లేక...
ప్రజల్ని నిత్య చైతన్యం చేయడానికా??
ఎందుకు రాస్తున్నట్టు కవిత్వం??????

కవిత్వం 
భక్తిని ప్రభోదిస్తే.....
అది వ్యక్తి శక్తిని నిర్వీర్యం చేసినట్టే!

వ్యక్తి లోని శక్తిని ప్రేరేపిస్తే...
బంగారు భవితకు బాటలు వేసినట్టే!!

ఈ అత్యాధునిక లోకంలో
కవిత్వం
స్నేహతత్వాన్ని  పంచగలిగితే
మానవత్వాన్ని  పెంచగలిగితే..
స్పర్థ,స్వార్థపరత్వాల్ని త్రుంచగలిగితే...

అనైక్యతను ఛేదించగలిగితే...
సమైక్యతను సాధించగలిగితే..

మనోధైర్యాన్ని నింపగలిగితే..
నిరాశా, నిస్పృహలను చంప గలిగితే

పురోగాభివృద్ధికై  పునాదులు వేయగలిగితే...
అవినీతి,అక్రమాలను సమాధి చేయగలిగితే..

ప్రేమాభిమానాలను పురికొల్పగలిగితే...
శాంతి,సామరస్యాలను  నెలకొల్పగలిగితే..

అదే అసలైన కవిత్వం అన్నట్టు.
అతడే నిజమైన కవి అన్నట్టు..
(  అవునంటారా?  కాదంటారా??  ఏమంటారు????     )