ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
కస్యప-దనువు సంతతి. డా.బెల్లంకొండనాగేశ్వరరావు-చెన్నయ్
November 15, 2020 • T. VEDANTA SURY • Story

మారీచి కళ దంపతులపుత్రుడు కస్యపుడు ఇతను దక్షప్రజాపతి కుమార్తెలైన'అతిది' 'దితి' ' దానువు'కాల' ' అనాయువు' 'సింహిక' 'ముని' 'కపిల' క్రోధ' 'ప్రథ' 'క్రూర' 'వినత''కద్రువ'వలనువివాహంచేసుకున్నాడు,వీరిలోఅతిధి గర్బవాసాన'ధాత' 'మిత్రుడు' 'అర్యముడు' 'శుక్రుడు' 'వరుణుడు' 'అంశుడు' 'భగుడు' వివస్వతుడు' 'పూషుడు' 'సవితృడు'త్వష్ట' 'విష్ణువు అనే పన్నెండుమంది  జన్మించారు.అదితి గర్బాన జన్మించినందుకు వారు ఆదిత్యులైనారు.దితి గర్బాన 'హిరణ్యాక్షుడు' 'హిరణ్యకసిపుడు'జన్మించారు. కాలకు'వినాసన' 'క్రోధ' అనేవారు,ప్రథ కు సిధ్ధులు జన్మించారు.క్రూరకు 'సుచంద్ర' 'చంద్రహంత' 'చంద్రకాంత'అనేవారుజన్మించారు ''దానువుకు'విప్రచిత్తి''శంభుడు,నిశంభుడు,నముచిఅనేపుత్రులు.వీరు,వీరిసంతతిదానవులుగాపిలవబడ్డారు.వీరిలోనముచివలన తనకు ప్రమాదమని గ్రహించిన ఇంద్రుడుఅతన్నిచంపాలనుకున్నాడు.సూర్యునిఆశ్రయించిన నముచికి ఇంద్రుడే స్వయంగాఅభయంఇచ్చిమాటతప్పివజ్రాయుధంతోఅతన్నిసంహరించాడు.బ్రహ్మహత్యామహాపాతకం వలన కుంభుడు,నికుంభుడి చేతిలో ఓడిపోయాడు.
మహిషాసురుని సంహరించిన కాళీమాత అతని అనుచరులైన 'రక్తబీజుడు' 'చండుడు' 'ముండుడు'వంటి వారిని సంహరించలేదు.వింధ్యపర్వతాలలోఉన్న 'కౌశికి'అందమైనదిఅనితెలుసుకొనితననువివాహమాడాలని'సుగ్రీవుడు'అనేరాక్షసునిద్వారాకబురుపంపాడు.శంభుడుయుధ్ధంలోతననుజయిస్తేవివాహంచేసుకుంటానుఅంది కౌశికి.ఆమెను పట్టితెమ్మని 'ధూమ్రాక్షుడు'అనేరాక్షసుని పంపాడు.అతను మరణించడంతో,కాళీ శరీరంనుండి ఒదివ్యశక్తి భీకర ఆకారంతో సృష్టించబడి చుండుని,ముండుని,రురునిపంపాడు.అలారురుని,ముండుని,చుండుని ఆభీకర ఆకారం సంహరించడంతో ఆమెకు 'చాముండి'అనేపేరువచ్చింది.
అప్పుడు 'రక్తబీజుడు ఆమెను ఎదుర్కొన్నాడు.అతని రక్తపుచుక్క నేలపై పడితే మరోరక్తబీజుడు పుట్టుకు వస్తున్నాడు వరప్రభావంచేత.కాళి  పెంచి రక్తబీజుని రక్తం నేలపైపడకుండా చేయడంతో చాముండి అతన్నిసంహరించింది.అలా శుంభుని,నిశుంభుని కాళీ,చాముండిలు సంహరించి అంతర్ధానమయ్యరు.