ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
కాకమ్మ కథలు చెప్పుచు ప్రాకటముగనూరడించు*ప్రతితల్లియిలన్! కాకము జనహితకరిగా వేకువనేయిళ్ళముందు*వేంచేయునుగా! కాకము నరచిన బంధువు రాకకు సూచికముమంచి*లక్షణమనుచున్! నాకముననున్నపితరుల సాకగ నతిథులకుమంచి*స్వాగత మిడుటన్! కాకుల నరుపును వినగా నేకంగా నేకగుంపు* లేకమునగుచున్! ఆకొనికూడును నపుడే కాకులబలగమ్ముబంధు*గణమందురిలన్! కాకముకథలుననేకము నేకరువుగచెప్పుచుండు*నెవ్వారైనన్! కాకము మాంసాహారిగ కాకపు గళమందునరుచు*కావ్కావనుచున్! కాకము కలినాకలికై లోకములోనున్నచెత్త*లోగిళ్ళందున్! పాకుచు,వ్యర్థాహారము పీకుచు శుభ్రమ్ముచేయు*ప్రీతితొముక్కున్! కాకము యెరుపగు దొండను నీకలిమాంసమ్మటంచు*నెంచుచుముదమున్! నాకసమునవిహరించగ కాకికి ముక్కెరుపటంచు*కవికథలల్లున్! కాకము కుళ్ళిన మాంసము బాకగుతనముక్కుతోడ*కదిలించితినున్! కాకులునిష్కల్మశముగ వాకిలి శుభ్రమ్ముచేయ*పరులకుమేలున్! కాకినియేకాక్షనెదరు కాకినివాయసమటంచు*కవులందురుగా! కాకినిభలిభుక్కందురు కాకిని యండజమునంద్రు*ఘనకోవిదులున్! కాకియె శనివాహనమట కాకియె పితరులకురూపు*గానెంచుచునే! కాకికి పాదమువేయుచు కాకికి పిండమునుపెట్టు*కర్మగతులలో! కాకులుదూరనికారడ వా?కనుయనునానుడినిల*వాడుదురుకదా! కాకిల లోకము సాక్షిగ యేకంగాసామెతలును*యెన్నోకలిలో! -మురళీధర శర్మ మాడుగుల
June 24, 2020 • T. VEDANTA SURY • Poem