ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
కాలం నీతో నడవదు: -రాజేష్ మిట్టపల్లి... 9441672957
November 2, 2020 • T. VEDANTA SURY • News

ప్రతి మనిషి జీవితంలో ఎన్నో విజయాలు సాధించాలని అనుకుంటాడు దానికి దగ్గ కష్టం పడ్డా ఫలితం ఉండదు. ఓడిపోయిన ప్రతి సారి ఈ జీవితం ఎందుకు అని బాధపడతాడు, అలాంటి ప్రతి వ్యక్తికి కాలం ఓ గుణపాఠం చెపుతుంది. కాలంతో మనం నడవాలి అంతేగానీ మనము  వచ్చే వరకు కాలం ఆగదు. సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు, మనమీద మనకు నమ్మకం ఉండాలి ప్రతి మనిషి జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైన సంకల్పం కోల్పోకుడదు. కాలం మారుతూ ఉంటే, మన జీవన శైలి మారాలి కాలానికి అనుగుణంగా నీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవాలి. " మొక్క ఐ వంగనిది, మానై వగ్గునా" అంటే ప్రతిమనిషి చిన్నతనం నుండే మారాలి. కష్టాన్ని, అనుబంధాలను, ప్రేమానురాగాలను,  అలవాటు చేసుకోవాలి. లేకపోతే  మనం మారిలి అనుకున్న, మన బాడీ సహకరించదు జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తోంది.  మనం చేసే పనిలో ప్రతి నిమిషం విలువైనది సమస్య ఏదైనా తొందరగా పరిష్కరించాలి. కాలానికి కులము, మతము తెలియవు నీవూ మంచొడివ, చెడ్డొడివ అవసరంలేదు అందుకే మనం ఏది చేయాలనుకుంటే అదే చెయ్యాలి. నీవు చేసే పనిలో కాలం నీకు ఎన్నో పరీక్షలు పెడుతుంది అవేం పట్టిచుకోవద్దు జీవితంలో కామలే ఉండాలి పోలిస్ట్టాప్ ఉండకూడదు అప్పుడే అనుకున్నది సాధించగలగుతారు. ఈ సమాజంలో  నీ ఆలోచన విధానం మరొకరికి ఇబ్బంది కలిగే విధంగా ఉండకూడదు , చేసే ప్రతి పని నలుగురు మెచ్చుకునేల ఉండాలి. నీవు ఎంత ఎంతుకు ఎదిగిన, ఎంత సంపాదించినా నీకు కావలసినంత ఉంచుకొని మిగతాది లేని వారికి ఖర్చు పెట్టు, అప్పుడు ఈ సమాజంలో మార్పు వస్తుంది, పేదరికం తగ్గుతుంది. నీవు సంపాదించినా తెలివితేటలు నలుగురికి నేర్పు ఎందుకంటే వాళ్ళు కూడా నీలాగే గొప్ప వ్యక్తులుగా పేరు వస్తుంది. కాలంతో పరుగెత్తడం నేర్చుకో...