ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
కాలం --కె ఎస్ అనంతాచార్య
September 24, 2020 • T. VEDANTA SURY • Poem

 ప్రవాహం సుడులై తిరుగుతూ,
నురగల తరగల తో
 పద పద మంటూ 
ఆగకసాగే ప్రయాణం


పేర్చిన ఒక్కొక్క ఇటుక
అనుభవాల మేడయి
 సమస్యల
విశ్లేషించే వర్ణపటం!


నిశ్చలతలేదు,
సాగటంతప్పదు
కలిస్తే కౌగిలి 
విడిపోతే పులి


వెలిసిపోని రూపు
వేగానికి ప్రతీక
ఏదీ దాచుకోదు
ఎవ్వరిని వదలకుండా కదిలిస్తుంది
 


ఎదురు చూసే కళ్ళకు
అందమైన చిత్రం
రోసిన మనసుకు
అందని జోస్యం

పెరుగుదలను  పోషిస్తుంది
వికాసాన్ని నిర్దేశించి
స్వారిచేస్తుంది 

విర్రవీగిన కిరీటాలు  హిట్లర్
 ముసోలిని లు, 
మెలేసిన మీసాలు
కాలగర్భంలో మిగిలిన
 శకలాలు

సిరు లు కురిసిన
భోగాల్లో తులతూగినా
మేఘాల్లో తేలిపోక
కాలమొక్క రీతి గడప వలయు
బాధలకు మరపు పూత పూసి
 అనుభవాలను జ్ఞాపకాల దొంతరల్లో తోసి దోబూచులాడే కాల కేళీ
కాల గమనం తెలిసిన  కలామ్ 
వివేక మథనం చేసిన వివేకానందులు చరిత్ర లో మెరిసే తారకలు!
 గడసరిది కాలం 
కవ్విస్తుంది,మురిపిస్తుంది 
మాయ చేసి
చీకట్లోకి తోసేస్తుంది  
కాలాన్ని జయించలేం!
ఉదయించే వెలుగును
అడ్డగించలేం!