ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
కాలకింకరుడు: - డాక్టర్ . బి. వి. ఎన్ . స్వామి
October 12, 2020 • T. VEDANTA SURY • Story

‘‘వాడెంత పనిచేసిండో చూసినవా’’ అన్నడు బుంగి
‘‘ఎవరతను’’ అడిగిన
‘‘యాదగిరి తమ్ముడు రాజేశం’’
‘‘ఏం చేసిండు వాడు’’
వాడు వివాహితుడు. వివాహేతర సంబంధం ఉన్నవాడు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకొని ప్రోత్సాహకం తీసుకున్న ఉద్యోగి. ఎడమ చేత ప్రభుత్వోద్యోగం, కుడిచేత వ్యాపారం చేస్తున్న ఘనుడు. ఇంట్లో జీవిత భాగస్వామి, బయట వ్యాపార భాగస్వామితో కాలం పంచుకుంటున్న కాలకింకరుడు. 
సిటీలో ఖరీదైన లంకంత కొంపను ఆమె పేరున ప్రేమ కానుకగా రిజిష్టర్ చేయించిండు. గార్డియన్‌గా తన పేరు నమోదు చేసుకున్నడు. బెటర్ హాఫ్ నుండి గార్డియన్ అవతారమెత్తిండు. గార్డియన్ నాకా? నా ఆస్తికా? అనే అనుమానం ఆమె కొచ్చింది. ఫలితంగా సంతానం మీద ఆమెకు కోరిక పెరిగింది. అతని వల్ల సంతానం కలగదని తేలింది. ఆమె పక్కచూపులు మొదలుపెట్టింది. మొగ్గలోనే పసిగట్టాడతను. ఎప్పటి లాగానే వీకెండ్‌కు నగరానికి వెళ్ళారు. ఆ రాత్రి గడిచింది. తెల్లవారి మధ్యాహ్నానికల్లా అతడు పోలీస్‌స్టేషన్‌లో, ఆమె చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకుంది అని ఫిర్యాదు చేసిండు. చివరి నిమిషంలో ఆమె బంధువులు దిగారు. తిరిగి పోస్ట్‌మార్టమ్ చేయించారు. హత్య అని తేలింది. ఆమె చితి మీదికి, అతను జైలుకు వెళ్ళారు. బంగారం లాంటి బతుకును బజారుపాలు చేసుకోవడం అంటే ఇదే కదా’’ అంటూ నావైపు చూసిండు బుంగి.
పరధనముల్ హరించి, పరభామలనంటి, పరాన్నమబ్బినన్
మురిపమ, కాని మీద నగు! మోసమెరుంగదు మానసంబు, దు
స్తరమిది, కాలకింకర గదాహతి పాల్పడనీక మమ్మునే
తరిదరి చేర్చి కాచెదవొ, దాశరథీ కరుణాపయోనిధీ
దాశరథీ శతకం
కంచెర్ల గోపన్న