ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
కాలాన్ని వెనక్కి తీసుకెళ్లే శక్తి ఉంటే ఎంత బాగుండో కదా.!-టి.జాన్ రెడ్డి
August 20, 2020 • T. VEDANTA SURY • Poem

ఎన్ని జీవితాలు మళ్లీ మళ్లీ మొదలవుతాయో కదా..!
*******
మనకు నచ్చినట్డుగా...
మన జీవితాన్ని మళ్లీ
మొదలు పెట్టేయొచ్చు కదా...
******
అప్పుడు అలా చేసి ఉంటే బాగుండు... అయ్యో ఆ పొరపాటు చేశానే...
అది మిస్ అయ్యానే అనే బాధలే ఉండవు కదా..!
*******
మానవులు ఆశా జీవులు కదా...
సకల చరాచర సృష్టిలో
రేపు అన్న ఆలోచన ఉన్న వ్యక్తి ఒక్క మనిషే కదా...!
అందుకే ఈ ఇబ్బందులు కదా..!
*******
ఈ పాడు సమాజం అసలు బ్రాడ్ మైండ్ గా ఆలోచించదు ఎందుకో కదా...!
పరుల జీవితాల్లోకి తొంగి చూస్తూ...ఏది పడితే అది వాగేస్తూ శునకానందం పొందుతూ ఉంటారు కదా...!
*******
అలాంటి వారు ఆనందంగానూ ఉండలేరు...ఇతరులు సంతోషంగానూ ఉంటే అసలు తట్టుకోలేరు కదా...!
-