ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
కుషన్ కుర్చీలో కూర్చున్న రచయిత బయట కొండపైనభవనాల దీపాలు మిళమిళ మెరవటంచూస్తూ ఏదో ఆలోచన చేస్తూ " మంచి నుండి చెడ్డకు, చెడ్డ నుంచి మంచికి రావడం ఎంతలోఎంత మార్పు అని రచయిత తనలో తాను అనుకుంటాడు.తను జట్కాలో ఉన్నపుడు అక్కడి పరిస్థితు లను ఎంతగానో చీదరించుకుని బాధపడ్డాడు. ఇంతలోనే సౌందర్యవంతులు,హాని కలిగించని దయర్ధ్ర హృదయుడూ, వృద్ధుడూ ఉంటున్న భవనలోకి చేరడం ఎంత గొప్పమార్పు అనుకున్నాడు రచయిత. ఆ యజమాని పేరు, ఊరు లాంటి సమాచారాన్ని కనుక్కోవాలనుకుని మరల వెనక్కి తగ్గాడు. అనేక వస్తువులచే అలంకరింపబడిన అందమైన గదిలోకి ఆ ముసలాయన అక్కడ ఉన్న వారందరినీ తీసుకుని వెళ్ళి విశ్రాంతి తీసుకోమని చెప్పాడు. ఏదికావాలంటే అది అడగమన్నాడు. తను శూద్రుడనని చెబుతూ వంటలకు వంట బ్రాహ్మడున్నాడన్నాడు. వంట బ్రాహ్మణుడు జబ్బు పడ్డాడన్నాడు. ముసలాయన తనే కొన్ని ఫలహారాలు తయారు చేసి ఇస్తానన్నాడు రచయితకు. బయటకు పరుగెత్తి వెళ్ళి తన కూతురుతో " శుద్ధమైన నీహస్తాలతో కాఫీ చెయ్యమ్మా అంటూ, పనివాళ్ళను తాకనీయొద్దు. " అంటూ ముసలాయన తన ఫలహారానికి వడి వడిగా వెళ్లిపోయాడు. ఆరోజుల్లో అగ్రవర్ణాలవారు శూద్రుల దగ్గర భోజనాలులాంటివి చేసేవారు కాదు. అలాగశూద్రులు కూడా అగ్రవర్ణాలవారికి ఆ గౌరవాన్ని అందిచ్చే వారు. పావుగంట పోయిన తరువాత ఆ ముసలాయన కూతురు రచయితకు వెండి పళ్ళెంలో కాఫీ, బిస్కెట్లు మెరుపుతీగలా తీసుకువచ్చి ఇచ్చింది. ఆ మెరుపు తీగ ఎవరోకాదు. సౌందర్య రాశి , యవ్వనపరిమళముతో కూడుకున్న అమ్మాయి " సౌదామిని". ఆ అందాల రాశే ' సౌదామిని' అని రచయితకు తరువాత తెలిసింది. ఆమె తరువాత తన పనికత్తె ద్వారా లోనికి కాఫీ పంపింది. ఇంతలో ముసలా యన వచ్చి పనిమనిషి కాఫీ తేవడం చూస్తాడు. ఆమెపై ఆగ్రహించి ఆచారాలపై బారెడు ఉపన్యాసం ఇచ్చి మళ్ళీ అమ్మగారిచే కాఫీ చేయించి తెమ్మంటాడు. తను శూద్రుణ్ణి అని తనకు తానే చెప్పుకుం టూ అగ్ర వర్ణజాతులకు ఎంతో గౌరవం ఇస్తాడు ముసలా యన. పరుగున ' సౌదామిని' దగ్గరకు వెళ్ళి ఆమెచే మళ్లీ కాఫీ చేయించుకురా అంటాడు ముసలాయన. సౌదామినిచే కాఫీ చేయించి మళ్లీ ఆపనిమనిషే తెస్తుంది. ముసలాయన ( పేరు బాలయ్యట ) " నీ చేతులు మళ్లీ మలిన పరచాయి " అంటాడు పనిమనిషినుద్దేశించి." నేను వాటిని పట్టించు కోను. మీ అమ్మాయి(సౌదామిని)ని ఇబ్బంది పెట్టకండి" అంటూ పనిమనిషి చేతిలో కాఫీ తీసుకున్నాడు రచయిత. అలా తీసుకునేసరికి తనతోపాటు భోజనం ఎందుకుచేయ కూడదు అని బాలయ్య రచయితను ప్రశ్నిస్తాడు. అందుకు సమాధానంగా కాఫీ, ఎండు తిండి పదార్థాలు ఎవ్వరి చేతి నుండైనా పుచ్చుకుంటాను కానీ అన్నం మాత్రం బ్రహ్మణుల చేతినుండే అని అంటాడు. అందుకు బాలయ్య " మీరు మీ కులాన్ని గౌరవిస్తున్నందుకు సంతోషం. అందుకు మీయెడల నాకు గౌరవం ఉంది. కులాన్ని గౌరవించేవాడు తన్ను తానే గౌరవించుకుంటాడు.సమాజాన్ని గౌరవిస్తాడు." అంటాడు బాలయ్య. అందుకు సమాధానంగా నా ఆచరణ కంటే నా సూత్రాలు చాలా ముందుంటాయి అంటాడు రచయిత. అందుకు సమాధానంగా బాలయ్య తన సూత్రాలకంటే తన ఆచరణే తన ముందరున్నది. కానీ సూత్రాన్ని గుర్తించక తప్పదు. ఇలా ఇద్దరూ కులం సూత్రాల గురించి, కులం యొక్క అంశాల గురించి, నియమాల గురించి, శాసనాల గురించి చర్చించుకున్నారు. ఇంతలో విస్కీ వైపు బాలయ్య చర్చ మళ్ళించి దాని గుణగణాలపై ఉపాన్యాసం సాగించి రచయితను కొద్దిగా విస్కీ పుచ్చుకోమంటాడు. అందుకు రచయిత సున్నితంగా తిరస్కరిస్తాడు. రచయితనుబాలయ్య మెచ్చుకుంటూ " నియమం వంటిది మరేదీ లేదని, అందుకే తనంటే గౌరవమని చెబుతూ ఒక గ్లాసులో కొద్దిగా విస్కీ వేసుకొని తాగేస్తాడు. ఇంతలో మరో కాఫీ పట్టుకుని సౌదామిని వచ్చి తల వంచుకుని గుమ్మం దగ్గర ఆగింది. అందుకు బాలయ్య సౌదామినితో " వీరు బ్రాహ్మలు. పవిత్ర మైనవారు. నా మిత్రుడు. లోనకు రా ! " అంటాడు. లోనకువచ్చి కాఫీని బల్లమీద ఉంచింది.ఇంతలో బాలయ్య ఆమెనుపిలిచి " జాలరి కన్యను వివాహమాడిన రాజుపేరు చెప్పమంటాడు. ఆమె సమాధానం చెప్పకుండానే వెనుదిరిగివెళ్లిపోతుంది.బాలయ్యకు సౌదామిని ప్రవర్తన నచ్చలేదేమో! " మానవ స్వభావంలో , ముఖ్యంగా యవ్వన స్వభావంలో వికారం ఉంది. స్త్రీలలో అది మరీఅధికం. వెళ్లిపో అమ్మా అని అన్నాననుకోండి. ఆమె ఉండిపోతుంది. ఉండమ్మా అని అన్నాననుకోండి వెళ్లిపోతుంది." అన్నాడు బాలయ్య. కానీ రచయిత మనసుకు ఆమె అందం పరికించాలని కుతూహలంగా ఉంది. తండ్రి దగ్గరగా ఉన్నప్పుడు అలావాళ్ళమ్మాయిని చూడటం సభ్యతకాదనుకుని, మర్యాదగా ఉండి వెళ్లిపోవడం మంచిదనుకుంటాడు రచయిత. ( సశేషం) శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్ : 701 3660 252.
August 18, 2020 • T. VEDANTA SURY • Memories