ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
కూరిమి-- డాక్టర్ . బి. వి. ఎన్ . స్వామి
September 26, 2020 • T. VEDANTA SURY • Story

మా అన్నయ్య కూతురు ప్రేమించి పెండ్లి చేసుకున్నది. పెండ్లికి ముందు వాళ్ళిద్దరు కూరిమితో కనిపించేవారు. ఇపడేమో ఇంట్లోనే ఎడమొహం, పెడమొహంగా ఉంటున్నరు. ఆర్థిక లేమి అనేది లేదు. ఇద్దరు పెద్ద ఉద్యోగస్తులు. దేనికి కొరతలేదు. అపోహకు తప్ప. రెండు రోజులు వెళ్ళి వాళ్ళింట్లో ఉన్న. బయటకు అంతాబాగానే ఉంది. ఎక్కడో కనిపించని పగులు ఒకటుందనిపించింది. పెండ్లికి ముందులేని పగులు ఇపడెందుకొచ్చినట్లు? కేవలం వ్యామోహం తీరడమే కాదనిపించింది. ఇలాంటి ఆలోచనల్లో ఉన్న నాకు ఒక రోజు ఆ ఇంట్లో జరిగిన సన్నివేశం సమాధానం చెప్పింది.
‘‘తెల్లారితే వీకెండ్ హాలీడేస్. రోజూ పరుగుల జీవితమే కదా? రేపు హాయిగా ఇంట్లోనే గడుపుదాం.’’ అతని ప్రపోజల్
‘‘చాలా రోజుల్నుండి మా ఫ్రెండ్ రమ్మంటుంది. దానింటికి పోయి వద్దాం’’ అందామె.
‘‘నీ ఇష్టం నువ్వు పో’’
‘‘నీవు రాలేదని అడిగితే ఏం చెప్పడం’’
‘‘అంకుల్ వచ్చిండు. ఆయనతో కలిసి ఇంట్లోనే ఉన్నడు అని చెప’’
అలా ఇద్దరి దారులు వేరయ్యాయి. సెలవురోజు తరువాత రోజువారీ రొటీన్ వర్క్‌తో ఇద్దరూ వెళ్తున్నరు. వస్తున్నరు. పగులు ఎక్కడో అర్థమయింది అని ముగించిండు బుంగి.
‘‘నీకు అర్థమయితే నాకు విడమరచి చెప’’ అన్నాను.
‘‘పెళ్ళికి ముందు స్వేచ్ఛ అధికం. దానికి ప్రేమని పేరు పెట్టుకున్నరు. పెళ్ళి తరువాత పరిమితులు అధికం. దాన్ని భరించలేక జీవితానికి పగుళ్ళు పడుతున్నవి. సమన్వయంతో పగుళ్ళను మూసివేయవచ్చు. కాని అది జరగడం లేదు’’ అని నిట్టూర్చిండు.
కూరిమి గల దినములలో
నేరము లెన్నడును గలుగ నేరవు మరి యా
కూరిమి విరసంబైనను
నేరములే తోచుచుండు నిక్కము సుమతీ
సుమతి శతకం
బద్దెన