ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
కూలీతల్లి బిడ్డ --చెన్నమనేని ప్రేమసాగర్ రావు
October 7, 2020 • T. VEDANTA SURY • Poem

పాతచీరే నీకు  
టుంగుటుయ్యాల 
అమ్మ పదమేనీకు 
లాలిపాట 
చెట్టు కొమ్మేనీకు 
చల్లని నీడ 
పిల్లతెమ్మరలేనీకు  
వింజామరలు 
కమ్మటి నిద్రనే
 కలలస్వర్గమునీకు 
చీకుచింతలేని 
చిన్నతనము నీది 
అమ్మపాలే నీకు శ్రీరామ రక్ష --!