ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
కె ట లి స్టు...: :డా .కె .ఎల్ .వి.ప్రసాద్ ,హనంకొండ .
November 12, 2020 • T. VEDANTA SURY • Poem

ఆడవాళ్ళకి 
పూవులంటే 
మహామోజు !

పువ్వుకనపడితే 
తీసి తల్లో ....
తురుముకోవలసిందే !

ఆడ పిల్లలూ అంతే ,
పూలకు --
పూలసువాసనకూ 
బానిసలైపోతారు !

పూలచెండు 
తలలో తురుముకున్న 
తరుణి తనువెల్లా ..
సువాసనలతో ..
గుబాళిస్తుంది ...
మగువ ఆకర్షణకు 
ఇది తోడవుతుంది !

వేసవిలో ...
మల్లెపూలు ...
మనిషి మనసునే కాదు 
పరిసరాలను సైతం 
వాటి పరిమళంతో 
రంజింప జేస్తాయి !

సన్నజాజులూ ...
సంపెంగలూ ,
సుగంధ సువాసనలతో 
మనిషిని మత్తులోకి 
దింపేస్తాయి ...
పూలలోని మహత్తు 
అలాంటిది ....!

పూలకు -పడతి కి 
ఉన్న అనుబంధం 
స్త్రీపురుషుల 
బంధానికి ఒక   కెట లిస్టు!