ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, డాక్టర్ సామల సదాశివ గారు బహుభాషాకోవిదుడు. సాహిత్యానికే తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు. ఈరోజు ఆయన వర్ధంతి* స్మరించుకుందాం.-- మాడిశెట్టి గోపాల్ -- సామల సదాశివ 1928, మే 11 న ఆదిలాబాద్ జిల్లా, దహేగావ్ మండలం తెనుగు పల్లెలో జన్మించారు. ఇతను బహుభాషావేత్త, తెలుగు మరియు ఉర్దూ రచయితనే కాకుండా గొప్ప సంగీత పండితుడు కూడా.సదాశివకు తెలుగు, సంస్కృతం, హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ, పార్సీ, మరాఠీ భాషల్లో మంచి ప్రావీణ్యం ఉంది. ఉర్దూ పత్రిక సియాసత్ లో సదాశివ వ్యాసాలు అనేక ఏళ్ళుగా ప్రచురితమయ్యాయి సంగీత శిఖరాలు, యాది వంటి వ్యాస సంకలనాలు సదాశివ రచించారు. అంజద్ రుబాయీలు, ఉర్దూ సాహిత్య చరిత్ర, మౌలానా రూమీ మస్నవీ, ఉర్దూ కవుల కవితా సామగ్రి, మిర్జా గాలిబ్ పుస్తకాలు కూడ ఇతని కలం నుంచి వెలువడ్డాయి. ముచ్చట్ల రూపంలో మనసుకు హత్తుకు పోయేట్టు చెప్పెడం అతనికున్న ప్రత్యేకత. అతని భాషా, శైలీ చాలా సహజ సుందరంగా ఉంటాయి. ఉస్తాద్ అబ్దుల్ కరీంఖాన్, హీరాబాయి బరోడేకర్, బడే గులాం అలీఖాన్, అల్లాదియా ఖాన్, బేగం అఖ్తర్, గంగూబాయి హంగల్, కేసర్ బాయి కేర్కర్, ఉస్తాద్ అంజద్ అలీ ఖాన్, ఇలా ఎందరో సంగీత విద్వాంసు లను, వారు ఆలపించే విధానాలను సదాశివ వివరిస్తాడు.డైట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఎంతోమందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దారు.ఆయన సేవలకు గుర్తింపుగా 2011లో సంగీత నాటక అకాడమి అవార్డు, 1998లో శ్రీపొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుంచి, 2002లో కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. ఆయన రాసిన మలయ మారుతాల్లో అతడు మనకు హిందుస్తానీ సంగీత ప్రపంచాన్ని, అందులోని మేటి కళాకారుల్నీ, వారి గొప్పదనాన్ని ఆత్మాభిమానాన్ని కళ్ళకు కట్టినట్టు వివరించాడు. ముచ్చట్ల రూపంలో మనసుకు హత్తుకు పోయేట్టు చెప్పెడం అతనికున్న ప్రత్యేకత. అతని భాషా, శైలీ చాలా సహజ సుందరంగా ఉంటాయి. ఉస్తాద్ అబ్దుల్ కరీంఖాన్, హీరాబాయి బరోడేకర్, బడే గులాం అలీఖాన్, అల్లాదియా ఖాన్, బేగం అఖ్తర్, గంగూబాయి హంగల్, కేసర్ బాయి కేర్కర్, ఉస్తాద్ అంజద్ అలీ ఖాన్, ఇలా ఎందరో సంగీత విద్వాంసులను, వారు ఆలపించే విధానాలను సదాశివ మనకు వివరించారు. తరువాత ఇక మనము హిందుస్తానీ రాగాల్ని రేడియో లోనో, క్యాసెట్ల రూపంలోనో, ఇంటర్నెట్లోనో వినకుండా ఉండలే నంతగా మనలో హిందుస్తానీ సంగీతం పట్ల అభిరుచిని కలిగించారు.వ్యక్తిగతంగా నేను అనేక సందర్భాలలో సదాశివ గారి తో కలవగలగడం నా అదృష్టం. వృత్తిరీత్యా ఆదిలాబాద్ లో పని చేస్తున్నప్పుడు అక్కడి ఆకాశవాణి కేంద్రంలో తరచుగా కలుసుకునేవారం. అప్పటి ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ ప్రసాద్ గారు, నేను, సదాశివ గారు అనేక విషయాలు మాట్లాడుకునే వారం. సదాశివ గారి ధారణా శక్తి అమోఘం. అలాగే మా సహోద్యోగి మంచిర్యాలకు చెందిన రాజయ్య గారి ఇంట్లో ఆయనతోపాటు డిన్నర్ చేయడం మరొక గొప్ప జ్ఞాపకం. కరీంనగర్ లో జరిగిన అనేక కార్యక్రమాలలో ఆయనతో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సదాశివ గారు ఆగస్టు 7, 2012న మరణించారు.ఆయనకు నివాళులు
August 7, 2020 • T. VEDANTA SURY • News