ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
కొండ పిండి కూర -2 - దివ్యమైన ఔషధం - పి . కమలాకర్ రావు
September 3, 2020 • T. VEDANTA SURY • health tips

పొత్తి కడుపులో నొప్పి కొందరిని ఇబ్బంది పెడుతుంది. కొండపిండి వేరు భాగాలను కోసి శుభ్రంగా కడిగి ముక్కలుగా చేసి నలగ్గొట్టి నీటిలో వేసి అందులో కొద్దిగా సోంపు గింజలు + తుంగ గడ్డల పొడి + తాటి కలకండ లేక బెల్లం వేసి మరిగించి , కాషాయం చల్లారిన తరువాత వడగట్టి తాగితే పొత్తి కడుపులో నొప్పి తగ్గి పోతుంది. కొండపిండి ఆకులను కడిగి దంచి రసం తీసి మజ్జిగతో కలిపి తాగితే జిగట విరేచనాలు , రక్త విరేచనాలు పూర్తిగా తగ్గి పోతాయి . సాధారణంగా జరిగే నీళ్ల విరేచనాలు కూడా దీనితో తగ్గి పోతాయి. కొండపిండి చెట్టు పూలను సేకరించి కడిగి నీటిలో వేసి కాషాయం చేసి వడగట్టి తాగితే రక్తపోటు , కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది