ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
కొడిగట్టినదీపాలు: --కిలపర్తి దాలినాయుడు--9491763261
November 21, 2020 • T. VEDANTA SURY • Poem

రాలిపడిన చుక్కల్లా
డంపు యార్డులో మెతుకుల పోటీ
బాల్యమా!ఎంతదయానీయం!!

చేతినిండ పనిలేక
ఇంటి పొట్టలుమంటల్లో మండుతుంటే
హాహాకారాలు ఆర్తనాధాలు
గృహస్తుడా!ఎంతదయానీయం!!

కడుపుకాల్చుకొని
కన్నపేగులను ప్రేమతో నింపితే
పేగుతెంచిన బిడ్డడే రోడ్డున పడేస్తే
వృద్ధతలిదండ్రులారా!ఎంతదయానీయం!!

అనాథత్వానికి చిఱునామాలెన్నో
రైలుబోగీలలో చింపిరి ముత్యాలు!
కామాఠీ పుర కేంద్రాలలో
బాలికా హింసోన్మాదాలు!
ప్లాటి ఫారమ్ లు
వీధి రోడ్లు,బస్సుస్టాండులు
బ్రద్ధలైన బతుకులెన్నో!
శిథిల గృహాలలాంటి దేశాలు
కాదు జీవంలేని దేహాలు
ప్రపంచం చేసిన వంచనకు
బలిపశువులు ఎందరో!
కొడిగట్టినదీపాలైన 
కంటిపాపలెందరో
డాలరు క్రింద నలిగినవారూ
రూపాయి అంచుతో నరకబడినవారూ
వారిలో వెలుగువచ్చిన నాడే పండుగ!
అనాథాసురుడు కనుమరుగైతేనె పండుగ!