ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
కోతి మామ ( బాల గేయం): -డా.ఎం.హరికిషన్-9441032212
November 18, 2020 • T. VEDANTA SURY • Poem

పందెం నాది 
పందిపిల్ల నీది
వెండి పళ్లెం నాది
సత్తు గిన్నె నీది
మెరిసే బంగారం నాది
కాకి బంగారం నీది
గోలుకొండ నాది
గూట్లో బెల్లం నీది
ఆకువక్క నాది
అరటితొక్క నీది
విమానం నాది
వీధికుక్క నీది
వంద నోటు నాది
చెల్లని రూపాయి నీది
దూద్ పేడ నాది
ఆవు పేడ నీది
చందమామ నాది
కోతిమామ నీది