ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
క్రీడా స్ఫూర్తి--డి.కె.చదువులబాబు --9440703716
October 1, 2020 • T. VEDANTA SURY • Story

ఒక అడవిలో జంతువులన్నీ చాలాస్నేహంగా ఉండేవి.కష్టసుఖాల్లో పాలు పంచుకునేవి.చాలాసరదాగా ఆటపాటలతో గడిపేవి.
వాటికి ఒక పెద్ద ఏనుగు రాజుగా ఉండేది.ఆగజరాజుకు కొన్ని ఏనుగులు మంత్రులుగాఉండేవి.
        ఒకసారి అవి గజరాజు ఆధ్వర్యంలోవనమహోత్సవం జరుపుకోవాలనుకున్నాయి. వనమహోత్సవానికి గజరాజు తేదీ నిర్ణయించింది.ఆటవస్తువుల బాధ్యత చింటూ అనే కోతికి అప్పగించింది. ఆటవస్తువులు చింటూ ఎలా సమకూర్చగలదని జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి.ఆరోజునుండి అవి పోటీలకు సన్నద్దంకాసాగాయి.చింటూకోతి రోజూ పళ్ళు తీసుకుని అడవినుండి వెళ్ళిపోయేది.సాయంకాలం తిరిగి వచ్చేది.అది ఎక్కడికెళ్తోందోమిగిలిన జంతువులకు అర్థమయ్యేది కాదు
.       వనమహోత్సవదినం రానే వచ్చింది.ఆరోజు జంతువులన్నీకలిసికట్టుగా వెళ్ళికొలనులో దిగాయి.ఒకదానిపై ఒకటి నీళ్ళు
చల్లుకుంటూ, కేరింతలు కొడుతూ,ఈదుతూ.స్నానం చేసాయి.నీళ్ళలోకి దిగలేని జంతువులకు ఏనుగులు తొండంతో  నీళ్ళుతెచ్చి
.స్నానం చేయించాయి.తర్వాత గజరాజువనదేవతను తల్చుకుని తొండంతో పూలుపైకి విసిరి,కొండపై టెంకాయకొట్టింది.ముం
దురోజు సేకరించిన  రకరకాల పండ్లు,దుంపలు,ఆకులు విత్తనాలతో సహపంక్తి భోజనంచేసాయి.
      తర్వాత ఆటలపోటీలు ప్రారంభిస్తున్నట్లు  ప్రకటించింది గజరాజు.చింటూ కోతిచెట్టుపైనదాచిన బ్యాటు,బాలు,చదరంగం
అట్ట,పావులు,స్కిప్పింగ్  తాళ్ళు తెచ్చిరాజుకిచ్చింది.ఆటవస్తువులు ఎక్కడతెచ్చావనిచింటూ నడిగింది పింకీ అనే కుందేలు పిల్ల.
కోతి కిచకిచమని నవ్వింది."వారం రోజులుగా పల్లెకు పండ్లు తీసుకెళ్ళాను.అక్కడగోపీ అనే అబ్బాయికిస్తూ  స్నేహం చేసాను.
నిన్నటి దినం వెళ్ళి ఆడుకోవటానికి ఒక్కరోజు ఆటవస్తువులివ్వమని అడిగి,తెచ్చాను"అని చెప్పింది చింటూ.
      చింటూను      జంతువులన్నీ     అభినందించాయి.గజరాజు మంత్రులను పోటీలకు న్యాయనిర్ణేతలుగా నియమించింది.
    ఏనుగులకు బ్యాటు,బాలు ఆట పోటీ     ఏర్పాటుచేసింది.తాబేళ్ళకు పరుగుపందెంపోటీ పెట్టింది.కుందేల్లకు చదరంగం పోటీ
పెట్టింది.నెమళ్ళకు  నాట్యంపోటీలు పెట్టింది.గుర్రాలు కబడ్డీ ఆడాయి.కోతులకు స్కిప్పింగ్   పోటీ పెట్టింది.జిరాఫీల కు ఎత్తైన చెట్ల
కొమ్మలు అందుకునే పోటీపెట్టింది. అలాఅన్ని జంతువులకూ రకరకాల పోటీలు పెట్టింది గజరాజు.పోటీల తర్వాత గజరాజు బహుమతుల ప్రధానోత్సవకార్యక్రమం ఏర్పాటుచేసింది.న్యాయనిర్ణేతలు విజేతలను ప్రకటించారు.
        చింటూ కోతి స్కిప్పింగ్ లోఓడిపోయింది.పింకీ కుందేలు చదరంగంలో ఓడిపోయింది.అవిరెండూ ముఖం వ్రేలాడేసుకున్నాయి.
కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుండగా.అక్కడనుండి జారుకున్నాయి.  గజరాజు గెలిచిన కుందేళ్ళకు గంపెడువిత్తనాలు బహుమతిగా ఇచ్చింది.గెలిచిన కోతులకు అరటి గెలలుబహుమతిగాఇచ్చింది.ఏనుగులకు చెరుకు గెడలు బహుమతిగాఇచ్చింది.గెలుపు గుర్రాలకు జొల్లెడు పచ్చగడ్డి బహూకరించింది.నెమళ్ళకు గంపెడుగింజలు బహూకరించింది.జిరాఫీలకుజొల్లెడు ఆకులు బహుమతిగా ఇచ్చింది.
  కార్యక్రమం పూర్తయ్యాక చూస్తే చింటూ,పింకీ ఎక్కడా  కనిపించలేదు.చింటూ అమ్మ పెద్దకోతి,పింకీ అమ్మ పెద్దకుందేలు ,వాటికి తోడుగా కొన్ని జంతువులుకలిసి వెదకడానికి బయలుదేరాయి.వెదకగావెదకగా ఓపొదచాటున కూర్చుని ఏడుస్తూకనిపించాయి.ఏడ్చిఏడ్చి కళ్ళు ఎర్రబడ్డాయి.ముఖం వాచిపోయివుంది."ఏమయిందీ...ఎందుకలా ఏడుస్తున్నారు?"అడిగింది కోతి.
"చదరంగం పోటీలో ఓడిపోయానుకదా!నాకు చాలా బాధగావుంది"అంది పింకీ."స్కిప్పింగ్ పోటీలో నేనూ ఓడిపోయాను
కదా!ఏడుపొస్తోంది"అంది చింటూ.ఆ మాటలకు పెద్దకోతి,పెద్ద కుందేలునవ్వాయి."ఓచిన్నారుల్లారా! ఆటలో గెలుపు,ఓటము
లుసహజం.ఇద్దరు పోటీపడినప్పుడు ఒక్కరే గెలుస్తారు.ఓడిపోవటానికి కారణాలు చాలావుంటాయి.వాటిని అన్వేషించాలి.చింటూ ఆటవస్తువుల సేకరణ కొరకు పల్లెకెళ్ళటంవల్ల సాధన చేయలేక పోయింది.గెలుపుకోసం తాబేళ్ళు పరుగెత్తడం సాధన చేశాయి.కుందేళ్ళు మట్టిలో చదరంగం గీసుకుని సాధన చేశాయి.నెమళ్ళు నాట్య సాధన చేశాయి.కోతులు అడవి తీగలతో తాడాట సాధన చేశాయి. గుర్రాలు,జిరాఫీలు కూడా కష్టపడి సాధన చేశాయి.మనంమరింతగా సాధనచేసి నైపుణ్యాన్ని పెంచుకుని విజయంసాధించాలి.గెలుపునే కాకఓటమినికూడా స్వీకరించటం,సాధన,కృషిచేసి పట్టుదలతో విజయం సాధించటమేక్రీడాస్ఫూర్తి. ఓటమికి కృంగిపోకూడదు.
గెలవాలనే కోరికపెంచుకోవాలి.ఆటల్లోనేకాక జీవితంలో కూడా క్రీడా స్ఫూర్తికల్గిగెలుపు,ఓటములను సమంగా చూడాలి.
నిరాశను దరిచేరనివ్వకుండా సాధనచేయండి.వచ్చేసంవత్సరం పోటీల్లో విజేతలవుతారు"అని చెప్పారు తల్లులు.చింటూ,పింకీ ముఖం మల్లెలా విచ్చుకుంది.