ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
క్వారంటైన్ రచనలు : - రక్షిత సుమ
August 21, 2020 • T. VEDANTA SURY • Book Review

·Sita: Warrior of Mithila (Part 2): --సీత వాళ్ళ అమ్మ సునైన చనిపోతుంది కదా..ఆ తర్వాత సీత మిథిల prime minister / రాణి అవుతుంది.సీత రాజ్యాన్ని చక్కగా చేసుకుంటునే రహస్యంగా  తన విష్ణు శిక్షణ కోసం అగస్త్య కూటమికి వెళ్తుంటుంది.అదొక గుప్త ప్రదేశం మలయపుత్రులకి తప్ప దాని గురించి ఎవ్వరికీ తెలీదు.సరే...అదలా ఉంచితే...నేను ఇంతకుముందు చెప్పినట్టు. వశిష్ఠుడు రాముడిని తర్వాతి విష్ణువుగా ప్రకటిద్దామనుకుంటున్నాడు. విశ్వామిత్రుడేమో సీతని. అయితే సీతకి ఒక ఆలోచన వస్తుంది. సీత రాముడిని పెళ్లి చేసుకుంటే........ఇద్దరు విష్ణువులు ఎందుకు ఉండకూడదు? ఇద్దరూ కలసి వాళ్ళ ధర్మాన్ని ఇంకా బాగా నిర్వర్తించొచ్చు కదా అనుకుంది. 
వాళ్ళ నాన్న జనకుడిని అడిగి స్వయంవరం ఏర్పాట్లు చేయించుకుంది. విశ్వామిత్రునికి చెప్పి రామ లక్ష్మణులను మిథిలకి రప్పించింది.
కానీ ఇక్కడ చిక్కేంటంటే, విశ్వామిత్రుడికి వశిష్టుడికీ పడదు. చిన్నప్పుడు ఇద్దరు ఒకే గురుకులంలో చదువుకున్నారు.ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. నిజానికి వశిష్టుడిని గురుకులంలో చేర్చిందే విశ్వామిత్రుడు.మరి తర్వాత ఏమైందో ఏమో ఇద్దరూ బద్ద శత్రువులవులుగా మారతారు. వాళ్ళిద్దరూ ఇద్దరు విష్ణువులంటే  ఒప్పుకుంటారో లేదో తెలీదు.
స్వయంవరానికి ముందు సమిచి ( రక్షక దళ ప్రధానాధికారి) .సీత నా అనుకునే, నమ్మదగిన వాళ్ళల్లో సమిచి ఒకతి సీతతో రాముడి ప్రాణానికి ప్రమాదం ఉంది వెళ్ళిపోమని చెప్పు అని చెప్తుంది.కానీ సీత తేలికగా తీసుకుంటుంది. ఊర్మిళ సమిచిలతో వెళ్లి  రాముడిని కలిసి మాట్లాడుతుంది. స్వయంవరంలో ఎటువంటి పోటీ పెడతారో చెప్పి సాధన చెయ్యడానికి ' పినాక ' ( అంతకు ముందు ఉన్న మహాదేవుని ధనస్సు పేరు అది / శివ ధనస్సు )ని తీసుకొని వెళ్తుంది. కానీ రాముడు న్యాయంగా పాల్గొంటానని చెప్తాడు.
స్వయంవరం రోజు రానేవచ్చింది. ఎవరు పిలిచారో తెలీదు కానీ తన పుష్పక విమానం వేసుకొని కుంభకర్ణుడు ఇంకా తన సైన్యాన్ని వేసుకొని రావణాసురుడు కూడా వస్తారు. {ఇక్కడ పుష్పక విమానం అంటే,ఏదో మాయల వల్ల ఎగిరే రెక్కల పెట్టే అని చెప్పలేదు, లంక వాళ్ళు నిర్మించుకున్న శంఖువు ఆకారంలో (conical shape)లో ఉండే  ఒక ఎగిరే వాహనం }
చెప్పలేదు కదా! రావణాసురుడు విశ్వామిత్రుడు దూరపు చుట్టాలవుతారట..!
మనకి తెలిసినట్టే, రావణుడికి అవమానం జరుగుతుంది, ఆయన కోపంతో వెళ్ళిపోతాడు.రాముడు శివధనస్సు తో  ceiling పైన రౌండ్ రౌండ్ గా తిరుగుతున్న చేప బొమ్మని, దాని కింద కదులుతున్న నీళ్లలో చూసి బాణంతో కొట్టే task పూర్తి చేస్తాడు. సీత రాముల పెళ్లితో పాటు లక్ష్మణుడు ఊర్మిళల పెళ్లి కూడా అవుతుంది.
ఆ తర్వాతి రాత్రి రావణుడు మిథిల మీద దండెత్తుతాడు.( ఆయనకి రాత్రి పూట యుద్దం చెయ్యడం తప్పని తెలిసినా,చేస్తాడు). ఎంత ప్రయత్నించినా వాళ్ళని ఎదుర్కోవడం కష్టమే అవుతుంటుంది.మిథిల గెలవాలంటే వాళ్ళకి ఉన్న ఏకైక మార్గం ఒక nuclear weapon లాంటి ' దైవాస్త్రాన్ని 'వాడటం. దాని వల్ల వాళ్ళ ప్రత్యర్ధులు మూర్ఛ పోవచ్చు లేదా 3-4 వారాలు కోమా లోకి వెళ్లిపోవచ్చు) అయితే వాయుపుత్ర తెగ వాళ్ళ అనుమతులు లేకుండా దాన్ని వాడితే 14 సంవత్సరాలు వనవాసం చెయ్యల్సి వుంటుందని పూర్వ మహదేవుని నిబంధన. రాముడు సీతా లక్ష్మణులు మహా దేవుడి భక్తులు.ఆయన కట్టడి జవదాటడం ఇష్టం లేక దానికి ఒప్పుకోరు.
సీత లేని సమయం చూసి విశ్వామిత్రుడు రాముడిని రెచ్చగొట్టి,emotional blackmail చేసి రాముడే ఆ అస్త్రం లంక సైన్యం మీద వాడేటట్టు చేస్తాడు.
లంక సైన్యం మూర్చపోయింది. రావణుడు కుంభకర్ణుడు ఇంకా కొంతమంది సైన్యం ఆ గాలి మోటార్ ఎక్కి లంకకి బయలుదేరుతారు.మూర్ఛ పోయిన లంక సైనికులని అగస్త్య కూటమికి తీసుకెళ్ళి చికిత్స చేస్తారు.వాళ్ళు  కోలుకున్నాక లంకతో మళ్లీ మిథిల మీద దాడి చెయ్యకుండా రాయబారం జరపొచ్చనేది వ్యూహం.
కానీ సీతకి విశ్వామిత్రుడి మీద పట్టలేనంత కోపం వచ్చింది." నేను వద్దన్నా ఆ అస్త్రాన్ని ఎందుకు వాడారు.అంత తప్పని పరిస్థితే వస్తే మీరే వాడొచ్చు కదా.రాముడు వాడేటట్టు ఎందుకు చేశారు" అని కోప్పడింది.
కానీ జరగాల్సింది జరిగిపోయింది. రాముడు మహాదేవుని నిబంధన అతిక్రమించాడు.14 యేళ్లు  వనవాసం చెయ్యాలి. అయితే వాయుపుత్రులకి ఈ పరిస్థితి వివరిస్తే అరణ్య వాసం నుంచి మినహాహింపు ఇస్తారు కావొచ్చు.కానీ రాముడు ససేమిరా అంటున్నాడు కదా...! 
తర్వాత ఏం అయ్యిందో చెప్పాలని ఉందిలే కానీ, ఇలా కుదరదు...మీరే వీలు చేసుకొని బుక్ చదవండి.అందులో ఉండే fine details, ఆ expressions ,  side track లో నడిచే కొన్ని కథలు, flash back లు, లాంటివాటినన్నిటినీ ఒక్క పోస్ట్ లో నేను చెప్పేదానికంటే మీరు చదువుతూ అనుభూతి చెందితేనే బావుంటుందని అనిపించింది.ఏమంటారు...అంతేగా!!!