ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
క్వారెంటైన్ సమయం లో చదివిన పుస్తకం.. Sita : The Warrior of Mithila-- ఎందుకో ఈ పుస్తకం చదవాలనిపించింది. E- బుక్ (pdf) డౌన్లోడ్ చేసుకొని చదవడం స్టార్ట్ చేసా......Sita : The Warrior of Mithila, Amish Tripathi రాసిన రామచంద్ర సీరీస్ లోని రెండవ పుస్తకం ఇది.మొదటిది Rama: Scion of Ikshwaku , మూడోది Raavan: Enemy of Aryavarta.ఈ పుస్తకం లో మొత్తం 21 chapters ఉన్నాయి. నిన్నటితో 10 chapters చదవడం పూర్తయింది. మరి అంత తొందరెందుకు మొత్తం చదివి ర్రాయొచ్చుగా అంటారా..?? రాయాలనిపించింది అంతే....రాస్తున్నా!!ఈ పుస్తకం యొక్క Genre ఫిక్షన్ ఏ అయినప్పటికీ అంతా నిజమేనేమో అనిపిస్తది.Infact ఇదే వాస్తవమేమో అనిపిస్తుంది. మిగతా కథలన్నీ ఈ కథకి exaggerations కలిపి చెప్తున్నారేమో అనిపిస్తుంది.భాష terminology కూడా వాడుక భాషలోవే. అప్పటి ప్రాంతాల పేర్లతో పాటూ ఇప్పుడు మారిన/మనకి తెలిసిన పేర్లు కూడా ఇవ్వడంతో ఇంకా సులభంగా వాళ్ళ ప్రయాణాన్ని visualise చేసుకోవచ్చు.ఇప్పటివరకు నేను చదివిన/విన్న versions అన్నిటికీ భిన్నంగా ఉంది ఇది.ఉదాహరణకి జటాయువు అంటే మాటలు వచ్చిన పెద్ద గరుడ పక్షి అనే తెలుసు నాకు,కానీ ఇందులో, genetic disorder వల్ల గద్ద ఆకారంలో ఉన్న మొహంతో పుట్టిన మనిషే అని చెప్తాడు.అలాగే నాగ,రుద్ర,మలయపుత్ర,వానర, ఇలా వేరు వేరు తెగల వాళ్ళు వేరు వేరు బాధ్యతలని నిర్వహించాల్సి ఉంటుంది.(అంతా మనుషులే! No super or supernatural powers).అస్సలు ఫస్ట్ chapter ఏ మస్త్అ నిపిస్తది.... ఇప్పటివరకు, అరణ్యవాస సమయంలో రావణాసురుని నిజ రూపం చూసి మూర్ఛ పోయిన సీతే తెలుసు, కానీ నిన్న, యాభై మంది లంక వీరులతో వీరోచిత పోరాటం చేసిన సీతని కలిసా.భలే అనిపించింది..(first version creates a sense of sympathy towards her helplessness while this one builds immense respect towards her )సీతని కాపాడుతూ జటాయువు చనిపోవడం కాదు, జటాయువుని కాపాడడం కోసం సీత పోరాడి ఓడుతుంది.అయినా,చిన్నప్పుడే శివ ధనుస్సుని ఒంటి చేత్తో పక్కకు నెట్టిన సీత, అలా మూర్ఛ పోయి surrender అయ్యిందంటే ఇన్నిరోజులు ఎలా నమ్మానబ్బా..?!అంతెందుకు, నిన్నటివరకు నాకు సీత వాళ్ళ అమ్మ,జనకుని భార్య,మిథిలా నగర రాణి పేరు తెలియదు.కరువులో ఉన్న రాజ్యాన్ని మళ్లీ సస్యశ్యామలంగా మార్చిన ఆమె గురించి ఇప్పటివరకు నేను చూసిన/చదివిన/విన్న ఏ రామాయణం లోనూ ప్రస్తావించలేదు.ఇంతకీ ఆమె పేరు చెప్పలేదు కదా.."సునైన ( Sunaina ) " గుర్తుంచుకోండి..! సీత అంత గొప్ప స్త్రీ గా మారడానికి ముఖ్య పాత్ర పోషించింది.చెప్పలేదు కదా, సీత గురుకులంలో చదువుకునేటప్పుడు తన best friend వాళ్ళ అన్న, పరిచయం అవుతాడు.తను secret mission పైన వేరు వేరు ప్రాంతాలు తిరుగుతుంటాడు.తన పేరు "హనుమాన్".ఇలా చాలా 'అవునా!' , 'నిజమా' , 'నిజమేకద' , 'నిజమే అయ్యుంటుంది' అనుకునే విషయాలు చాలా ఉన్నాయి.అసలు మీకు చెప్పాల్సిన విషయం ఒకటి ఉంది. విశ్వామిత్రుడికి ఒక ముఖ్యమైన భాద్యత నిర్వహించాల్సి ఉంది. అదేంటంటే, next విష్ణువు ని గుర్తించి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించడానికి / లోకకళ్యాణం కోసం సిద్ధం చేయడం. ఆ విష్ణువు/ విష్ణు స్వరూపం, రుద్ర ( శివ స్వరూపం ) తెగవాళ్ల సహకారంతో పని చేస్తారు. అంతకు ముందు విష్ణువైన పరశురాముడు కూడా అంతేఅట.అయితే, విశ్వామిత్రుడు Obviously రాముడినే select చేస్తాడనుకున్నా. కానీ ఇక్కడ విశ్వామిత్రుడు next విష్ణువుగా ఎంచుకుంది సీతని!!సీతతో యజ్ఞం చేయించి మరీ ఆమెకి విష్ణువు representative అని చెప్పే fish symbol ఉన్న కత్తిని కూడా ఇస్తారు.ఇది జరిగిన కొన్ని రోజులకు సీత వాళ్ళ అమ్మ సునైనా అనారోగ్యం తో చనిపోతుంది.చనిపోవడానికి ముందు సీతదగ్గర ఎప్పుడూ గతం గురించి ఆలోచించి బాధ పడొద్దు.ధైర్యంగా ఉండాలి.రాజ్యాన్ని దేశాన్ని కాపాడుతూ అభివృద్ధి దిశగా నడిపించాలని మాట తీసుకుంటుంది.అలాగే అందర్నీ గుడ్డిగా నమ్మొద్దు అనికూడా చెప్తుంది.అంతే అక్కడితో chaper 10 పూర్తయింది.ఇప్పటివరకు తెలిసిన version కి complete opposite గా సీతని తర్వాతి విష్ణువుగా ఎంచుకోడమేంటి? మరి రాముడి సంగతేంటి??తర్వాత ఏం జరిగింది...??లాభం లేదు..urgent గా మిగతా కథ చదవాలి..!!మళ్లీ చెప్తా ఆగండి- రక్షిత సుమ
August 18, 2020 • T. VEDANTA SURY • Book Review