ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
క్షమాపణ --కె ఎస్ అనంతాచార్య
October 2, 2020 • T. VEDANTA SURY • Poem

ఎంతటి తప్పిదమైనా
తలవంచి నిలబడి ఒక్కసారిగా ఆర్థిస్తే  ?

 సంస్కారం హెచ్చవేయబడి మనిషి తనకు తానే వశమైతే?

హింస,ద్వేషం పెచ్చరిల్లి పోయి సమాజానికి పశ్చాత్తాపం శాపమైతే?

తలనరికినా ఎదురు నిలిచి 
కడుపులో తల పెట్టినపుడు

సంస్కృతి నర నరాన జీర్ణించుకొని చేసే క్షమా ప్రార్థన 

పశ్చాత్తాపానికి మించిన మనోవేదన మరొకటిలేదు
క్షమకన్నా ఉదారత్వం ఇంకొకటి కనపడదు

ప్రతీకారాలు లోపల రగిలితే 
పగల రక్తపాతాలు ద్వేషాల శవాల గుట్టలు 

సందర్భాలు నిన్ను వంచినా  సమయాలు ఉపవసంలో ముంచినా శత్రువర్గాన్నీ  మిత్రులుగా ప్రకటన చేసే క్షమా పురుషోత్తము లెందరో?

క్షణం సహనం క్షణం మౌనం మటుమాయమయ్యే దుఃఖం లోంచి ఎగిసిపడే దయా కెరటాలు

సహనం ధర్మం ఓషధులై  శరీర రోగాన్ని కుదిర్చినపుడు పొందే సంతృప్తి

ఈ ఆభరణం ధరించడం అంటే దైవ స్వరూపాన్ని ఆవిష్కరించ డం

ప్రేమ ఆప్యాయత అనుబం ధా లు గొలుసుకట్టు చెరువుల్లో స్నేహ పుష్పలై వికశించడం