ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
గణనాథా--రచన:-డా.గౌరవరాజు సతీష్ కుమార్.
August 22, 2020 • T. VEDANTA SURY • Poem

గండాలూ బాపేసామీ
రావయ్యా గానానాథా
కావవయ్య గానానాథా-మము
కావవయ్య గానానాథా   !! గండాలు!!

సాంబశివుడి కొమరుడవయ్యా-నీవు
పార్వాతీ పుత్రుడవయ్యా
కైలాసం దిగిరావయ్యా
కైలాసం దిగిరావయ్యా  !! గండాలు!!

ఏనూగూ మోమూతోడా
ఎలుకా వాహానామెక్కి
వేగామె రావేమయ్యా
వేగామె రావేమయ్యా  !! గండాలు!!

అల్లామూ ఆరాటీపండ్లూ
బెల్లామూల మోరుండాలూ
తెచ్చీనీ కిచ్చెదమయ్యా
తెచ్చీనీ కిచ్చెదమయ్యా  !! గండాలు!!

ఉండ్రాళ్ళూ కుడుములునీకూ
పాశామూ పలహారాలూ
నైవేద్యం పెట్టెదమయ్యా
నైవేద్యం పెట్టెదమయ్యా  !! గండాలు!!

ఎల్లావిద్దెలకెల్లా సామీవీనీవేనయ్యా
సకలావిద్దేలన్నీ నాకియ్యీఓగననాథా
నీపూజలు జేతూమయ్యా
సక్కగనిను గొలుతూమయ్యా  !! గండాలు!!