ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
గతంలోకి ...!!-- డా.కె .ఎల్.వి.ప్రసాద్ ,--హనంకొండ ,వరంగల్.--9866252002--8886991785.
October 14, 2020 • T. VEDANTA SURY • Poem

ఒకప్పుడు 
మా చిన్నప్పుడు ,

అంటే ...
ఇంటర్నెట్ -
ఆన్లయిన్ సేవలు ,
అందరి గుమ్మం ముందుకి 
చేరకముందు ...

డబ్బును ...
అటు - ఇటు చేర్చే 
మాధ్యమం ...
తపాల శాఖలో ...
అత్యున్నత సేవ ...

ఇప్పుడు మనం 
మరచిపోయాం 
అది జ్ఞాపకానికి వస్తే ,
ఎంత ఆనందం ...!

దూరపు చదువుల్లో 
తల్లి దండ్రులనుండి ,

ఉద్యోగం చేస్తున్న పిల్లలు 
తల్లిదండ్రులకు ,

ధనం తో ముడిపడిఉన్న 
పరస్పర లావాదేవీలకు ,

పత్రికలనుండి ..
రచయితలకు ...

సురక్షితంగా ,
సొమ్ము అందించే విధానం ,
అదే ..' మని ఆర్దరు '...!

పొడుగాటి' మని ఆర్దరు ఫామ్ '
సందేశం ఉన్న చివరి భాగం ,
రసీదుగా ఇచ్చే పోస్టుమాన్ ,

అన్నీ అపురూప జ్ఞాపకాలు ,
అంతరించిపోయిన .
తపాలా సేవా కార్య క్రమాలు !

మని ఆర్దరు ఫారం 
పూర్తిచేయ గలిగిన వాడు 
ప్రతిభా వంతుడిగా ...
గుర్తించి న గొప్పరోజులు ...!!-