ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
గతి దప్పిన మతి(గేయ కథ)-- చొప్పా వీరభద్రప్ప
September 28, 2020 • T. VEDANTA SURY • Poem

 కేక రేగెను కడుపులో  కలచి వేసెను ఆకలి
పూవు లెక్కడ గానక   పొగిలి తిరిగెను దిక్కుల
దవ్వుదవ్వుల వెదికెను  యలసి సొలసెను తుమ్మెద
చేటుగాడు దేవుడంచు తిట్టిపోసెను గంపల.

కోట్ల జీవుల కెన్నియో    కోరకిచ్చెను దండిగా
కడుపు నిండగ మాకేమి   కలుతిండిగములిచ్చెన మెండుగా
పూలపుప్పొడి పూదేనె   పూని తిండిగ పెట్టెను
ఆశ లేకను బతుకు సాగ  ఆరగించితి మందరం.

ఎన్నొ సుద్దుల సవ్వడి   ఎగిసి పడియెను మనసులొ
అంతలోనె కన్నెదురను   కనియె తామర కొలనును
ఎగిరి వాలెను తుమ్మెద    కడుపు తీపికి లోనుగా
తనివిదీర మధువు గ్రోల   నిదుర ముంచుక వచ్చెను.

మునిగె పడమట సూర్యుడు ముడిచె రేకులు కుముదము
నిలిచె మధుపము తమ్మిలో  నించు కేనియు భయము లేక
కుచ్ఛినిండ మధువు గ్రోలి   ఇక్క డుందును రాతిరి
రేపు విచ్చును జలజము   రిత్త మాటలు తలచనేల.

అనుచు తలపులు సాగగ  మించె ఘీంకృతి దిక్కుల
చిక్కుబడితిని ఆశకు     కట్టు బడితిని ఇందులో
అంచు వేదన తలపగ   అలము కొనియెను దుఃఖము
అంత లోపుల ఏనుగు    అరుగు దెంచెను సరసికి.

తృప్తి దీర జలము తాగి    చూచె తామర తూడుల
చిందులాడి రాసి బోసి      తొక్కుకుంటును చనియెను.
దంతి యడుగుల నలిగి తేటి    పచ్చడాయెను చూడగ
తుమ్మి ఎరుగదు దంతిని   దంతి ఎరుగదు భ్రమరిని.

తేనె తాగి వెళ్లిపోక    తేటి నిలిచె తామరింట
ఎప్పుడేది చేయనోపు   అప్పుడదియె చేయదగును
ఆలసింప అంద లేము చేటు మూడు తొందరెపుడు
తూక మెపుడు తూచిచేయపొందు నిజము విజయ ఫలము.