ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
గత ఎం.ఇ.ఓ కాలంలో కొంతమంది ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘ నాయకులు సాయంత్రం పాఠశాల టైమింగ్స్ ముగియక ముందే ఆఫీసులో వచ్చి చేరిపోయేవారు. ఇదో విధమైన టైమ్ కిల్లింగ్. ఆఫీసు చేపల మార్కెట్ లా తయారవ్వడానికి మార్గం సుగమమైంది. ఆఫీసు" డెకొరం " దెబ్బతింది. మండల విద్యాశాఖ అధికారి ఆఫీసులో మూవ్ మెంట్ రిజిస్టర్ పెట్టాను. దాంతో ఆఫీసుకు ఎవరూ పనిలేకుండా రావడం మానేశారు. ఏ పని కావాలన్నా వ్రాత మూలకంగా ఉండాలి. దానిపై ఆఫీసుకు అప్లికేషన్ ను ఏ తేదీన ఇస్తున్నారో ఆతేదీ తప్పనిసరిగా వ్రాయాలి. ఆ విధంగా అందుకున్న అప్లికేషన్ ల సమాచారం కలిగి ఉండే రిజిస్టర్ ను ఒకదానిని ఆఫీసులో పెట్టడం జరిగింది. అభ్యర్థి ఇచ్చిన అప్లికేషన్ కు సీరియల్ నెంబర్ ఇచ్చి ఆ సీరియల్ నెంబర్ ప్రకారం సంబంధిత సమస్యలు పరిష్కారం చేయడం జరిగేది. దీనికి కారణం గుమస్తాలు అవినీతి కరమైన పనులు చేయకుండా ఉండటం కోసమే! నేను సీతానగరం హైస్కూల్ కు వచ్చిన కొత్తలో రికార్డు అసిస్టెంట్ ఉండేవాడు. రికార్డు వర్క్ అంతా అతనే చేసేవాడు. చిలక కొట్టుడు బేరాలు అతడు చేస్తుంటాడని ఆఫీసులో మిగిలిన సిబ్బంది ద్వారా విన్నాను. మరికొంతకాలానికీ ఒక అమ్మాయిని మా స్కూలు గుమస్తాగా వేసారు. ఆ అమ్మాయి 'డిసీజ్డ్ ' కోటాలో వచ్చింది. గుమస్తా ఏమేం వర్క్ చేయాలో ఆమెకు తెలిసేదికాదు. నేను కాపీయింగ్ వర్క్ ముందుగా ఇచ్చేవాడిని. మిగిలిన వర్క్ అంటే విద్యార్థులకు ట్రాన్ఫర్ సర్టిఫికెట్ లు, స్టడిసర్టిఫికేట్ లు వ్రాయడం, సేలరీ బిల్లులు తయారు చేయడం వంటి పనులు రికార్డు అసిస్టెంట్ చేస్తూ ఆఫీసులో ఉంచవలసిన ట్రూకాపీ వర్క్ ఆమెచేచేయించేవాడిని. అలా కొన్నాళ్ళకు ఆఫీసు వర్క్ ఆ అమ్మాయికి చేయడ మొచ్చింది. టీ. సీల వర్కకు వచ్చేసరికి తనను చేయనివ్వక రికార్డుఅసిస్టెంటే చేస్తామనే వాడు. దీనికి కారణం ట్రాన్ఫర్ సర్టిఫికేట్స్ పనిమీద వచ్చేవాడి దగ్గర ఎంతో కొంత కొట్టేయొచ్ఛని. ఆపని మీద వచ్చిన వారి దగ్గర నుండి అప్లికేషన్ తీసుకుని నాదగ్గరకు రికార్డు అసిస్టెంటే తెచ్చేవాడు. "నీకెందుకా శ్రమ. టీ. సీ కోసం వచ్చినవాడే అప్లికేషన్ పట్టుకొని డైరెక్ట్ గా నా దగ్గరకు వస్తాడుకదా ! అతనినే పట్టుకు రమ్మను " అని చెప్పి తిరిగి పంపించేసే వాడిని. ఎస్. ఎస్. సీ ఫలితాలు వచ్చిన రోజులలో రికార్డు అసిస్టెంట్ తో బేరసారాలు కొంతమంది చేసుకునేవారు కావాలి. అటువంటి వారంతా హెడ్మాష్ఠర్ రూం కు రాకుండా కాలు కాలిన పిల్లిలా రికార్డు అసిస్టెంట్ చుట్టూ తిరిగే వారు. నేను నాసీటులో కూర్చుని కిటికీ గుండా వరండా వైపు చూస్తే అలా ఆఫీసు స్టాఫ్ చుట్టూ ఎవరు తిరుగుతున్నారో క్లియర్ గా తెలుస్తుంది. అకారణంగా ఆఫీసుకు పనులపై వచ్చేవారికి వారి అప్లికేషన్ పై సీరియల్ నెంబర్ వేసి అప్లికేషన్లు నాదగ్గరే ఉంచి సీరియల్ ప్రకారం ఒకరి అప్లికేషన్ పని అయిపోయిన తర్వాత రెండవ నెంబర్ గల అప్లికేషన్ ను ఆఫీసు గుమస్తాకు ఇచ్చేవాడను. అలా ఒక సీరియల్ నెంబర్ తరువాత ‌మరొకటి అలావెళ్ళేది. సీరియల్ నెంబర్లు వేసి అన్ని అప్లికేషన్ లు ఒక్కసారిగా ఇచ్చేస్తే తనకు నచ్చిన వారి టీ. సీ వ్రాసి ఇచ్చేస్తాడు. ఎప్పుడైతే ఇలా చేసానో రికార్డు అసిస్టెంట్ కు చిలక కొట్టుడు పనులకు అవకాశం లేకపోయింది. ఇక అప్పటినుంచి రికార్డు అసిస్టెంట్ తను టీ . సీ లు, స్టడీసర్టిఫికేట్లు వ్రాయడానికి ముందుకు వచ్చేవాడు కాదు. ఈ పద్ధతినే మండలాఫీసులో ప్రవేశ పెట్టాను. నేను ఎం.ఇ .ఓ గా జాయిన్ అయిన వారం పదిరోజులలోనే రేషనలైజేషన్ జిల్లా అంతటా ప్రవేశపెట్టారు .అందులో సీతానగరం మండలంలో కూడా రేషనలైజేషన్ చేపట్టారు. రేషనలైజేషన్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మండలంలో గల కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు తక్కువమంది ఉంటే ఉపాధ్యాయులు ఎక్కువ మంది ఉండేవారు. అలానే ‌‌మరికొన్ని పాఠశాలల్లో విద్యార్థులు ఎక్కువమంది ఉంటేఉపాధ్యాయులు తక్కువమంది ఉండేవారు. ఈ ఎక్కువ తక్కువలను చూసుకొని ఎక్కడ అవసరం లేదనుకుంటే అక్కడ నుండి వారిని అవసరమైన చోటికి బదిలీ చేయాలి. అలా చేసేటప్పుడు మండలంలో గల ఏ ఒక్క టీచర్ ఇబ్బంది పడకుండా ఎవరికి ఎక్కడ కావాలో అక్కడ ఆయా దగ్గర స్కూలళ్ళో అడ్జస్ట్ చేసి లిస్ట్ తయారుచేసి మండల రిసోర్స్ పర్సెన్స్ కు ఇమ్మన‌మని చెప్పాను. ఆ జాబితాను పరిశీలించి జిల్లా విద్యాశాఖాధికారి వారికి అప్రూవల్ కోసం పంపడం జరిగింది. దానిని డి. ఇ. ఓ గారి అప్రూవల్ అయిన తరువాత కలెక్టర్ గారు ఫైనల్ అప్రూవల్ చేస్తారు. ఆ తరువాతేఉపాధ్యాయులు ఎవరి కొత్త స్టేషన్ లలో వారు జాయిన్ అవుతారు. ( సశేషం )- శివ్వాం.ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్ : 701 3660 252
June 30, 2020 • T. VEDANTA SURY • Memories