ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
గప్ చుప్!!--కె ఎస్ అనంతాచార్య
August 27, 2020 • T. VEDANTA SURY • Poem

ఇల్లే వైకుంఠం
పందిరే పరమపదo
జాలారే కోనేరు
ఇప్పుడు అపార్ట్ మెంట్లో వేల్లాట
గదుల మధ్యే జీవపదార్థ వ్యాపనం 
ఏకాంతంలో అందరు
కలిసే 
గ్రీన్ విచ్ టైమ్ ప్రకారమే నడుస్తూ
ఎవరికి వారైనా
అందరి తీరొక్కటే
వెబ్నార్లు,సెమినార్లతో 
ఆమెఅక్షర నారుపోస్తుంది
వర్క్ ఫ్రమ్ హోంలో
ఆయన కాయం దిగేశారు
ఆన్లైన్లో పిల్లల క్లాసులకు
మొబైల్ల ఛార్జింగ్
లాప్ టాప్ ల చేజింగ్
దీర్ఘ శ్వాసలు
నిట్టూర్పులు
 కషాయాల కలగా పులగం
నిశ్శబ్దాన్ని బేధించలేం
సత్యాన్ని ఒప్పులేం
పిల్లల ఆటలు
ఆటకెక్కి!!
అందరూ లిటిల్ సింగాలై టివీ ముందు
బంధింపబడి !!!
వికాసం
వినోదం వైరస్ చేతి
చక్రమైంది!
కాకుల అరుపులు
 బంధువుల
పిలుపులు లేవు
పలకరింపులు
ఓదార్పులు
చరవాణిలోనే
కడసారి చూపుల
వీడియోకా ల్లు!
కాలు కదుపం
కారు తీయం
షాపింగ్లన్నీ అమెజాన్ లో
 పేమెంట్లన్నీ గుగుల్లో 
పెత్తనం 
అంతా పోట్లగిత్త
ఫోను చేతిలోనే!!
నెట్టింటి రామాయణం లో 
అందరూ వొంటరి లంకలో నే!!