ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
గాంధీజీకి భారతియార్ లేఖ--- యామిజాల జగదీశ్
November 4, 2020 • T. VEDANTA SURY • News

గాంధీజీ తమిళనాడు పర్యటనలో భాగంగా 
వివిధ చోట్ల ఆంగ్లంలో ప్రసంగాలు చేసి గుజరాత్ వెళ్ళిపోయారు.

అప్పుడు తమిళ జాతీయకవి సుబ్రహ్మణ్య భారతియార్ గాంధీజీకి ఓ ఉత్తరం రాశారు.

"మీ ప్రసంగాలు అమోఘం. కానీ ఇంగ్లీషులో కాకుండా గుజరాతీలోనో లేదా తమిళంలోనో మాట్లాడినట్లయితే బాగుండేది" అని.

అందుకు గాంధీజీ ఇలా జవాబు రాశారు...

"మీ ఉత్తరం చదివాను. నా ప్రసంగాలు బాగున్నాయంటు మీరు మీ ఉత్తరాన్ని ఇంగ్లీషులో కాకుండా మీ మాతృభాషలో ఎందుకు రాయలేదు" అని గాంధీజీ ఉత్తర సారాంశం.

అయితే భారతియార్ ఎలా ప్రతిస్పందించారో చూడండి.....

"నేనెవరినైనా విమర్శించడానికో ప్రశ్నించడానికో మా మాతృభాషను ఉపయోగించను" అని!