ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
గాంధీజీ పై అనుకరణ పద్యాలు--కిలపర్తి దాలినాయుడు
October 4, 2020 • T. VEDANTA SURY • Poem

1.ఆ.వె.
కర్ర చేత బట్టి-కార్యంబు రచియించి
గీత చేత బట్టి-గీతమార్చి
కార్య కరణ మందు -ఘనుడురా గాంధీజి
భావి  స్వేచ్ఛ కొరకు-భరత పుత్ర!
2.కం.
దూరకుమీ పరులనెపుడు
చేరకుమీ చెడ్డవారి-చెలిమింజేయన్
పారకుమీ రణమందున
కోరుకొనుము గాంధి మార్గ,-గుణములనెపుడున్
3.ఆ.వె.
అనగననగసత్య-మతిశక్తి మంతమౌ
వినగవినగ గాంధి-విశ్వ గురువు
సత్యశోధనమున-సమకూరు పనులన్ని
గాంధి బాట మంచి-క్రాంతి పాట!
4.కం.
బలవంతుడ నాకేమని
పలువురితో నాగ్రహించి-పలికిన దొరకున్!
బలమూడిపోయె గాంధీ
తలచినసత్యా గ్రహమను-దండము తోడన్!
5.కం.
కనకపు భారత పీఠిని
శునకములైతెల్లదొరలు-శోభను గూల్చన్
తనకర్రతోడ బాపూ
పనిబట్టగ పారినారు-పాశ్చాత్యులిలన్!
6.ఉ.
పాలితులైనవారు దిగువందగనుండగ
తెల్లసర్పముల్
కాలిని కాటువే సిధర కంఠము లుత్తర
ణమ్ము జేయగా
పాలక శత్రువ ర్గములు భంగప డంగను
గాంధితాతయున్
తోలినవాడు నావలకు దొంగల బోలెడి
తెల్లవారలన్!
7ఉ.
భండన భీముడా;త్మజన
బాంధవు డి;ద్ధర గాంధితాతయే
గండర గండడై భారత ధర్మము సామ్యవాదముల్
దండము సత్యమే ;సమత
ధర్మము భారతావనిన్;
పండిన మేల్పసిండిగద :
భావికి స్వేచ్ఛను కానక్క నిచ్చనే!
8.శా.
లావొక్కిం తయులే డుధైర్యమువిశా
లంబాయె దేశంబులో
చావోరే వొయనన్ మహాత్ము నికరం
చందూసు పుత్రాంశు నిన్
భావాబ్ధిన్ సమరం బుతోజ యమునే
పంచంగ సత్యాగ్రహుల్
త్రోవల్దీ యగసం గమించి సభలో
రూపాందె కార్యావళిన్!