ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
గాలి గుర్తులు--ఇదొక అరవ పుస్తకం. హైకూల పుస్తకం. కేవలం స్త్రీలు మాత్రమే రాసిన హైకూలతో వెలువడిన పుస్తకం. 2007 లో అచ్చయింది. మద్రాసులోని పెరంబూరుకి చెందిన ఇరువాట్చి ఈ పుస్తకాన్ని ప్రచురించింది.అంతకుముందు 2002లోనూ తమిళంలో ఓ హైకూ పుస్తకం వచ్చింది. అందులో పన్నెండో తరగతి చదువుతున్న అమ్మాయిలు మాత్రమే రాసిన హైకూలతో కూడిన పుస్తకమది. ఇప్పుడు నా దగ్గరున్న గాలి గుర్తులు పుస్తకంలో యాభై ఎనిమిది మహిళలు రాసిన హైకూలున్నాయి. హైకూలకు పుట్టిల్లు జపాన్. మూడు పంక్తులలో మొత్తం పదిహేడు అక్షరాలతో ఉంటాయి. మొదటి పంక్తిలో అయిదు, రెండో పంక్తిలో ఏడు‌, మూడో పంక్తిలో అయిదక్ష రాలుంటాయి. వెబ్ స్టర్ న్యూవరల్డ్ నిఘంటువు ఈ విషయాన్ని పేర్కొంది. కానీ ఈ పుస్తకంలో పదిహేడు అక్షరాల నియమాన్నేమీ పాటించలేదు కానీ మూడు పంక్తులలో విషాయలను చెప్పారు. తమిళంలో హైకూలపై వచ్చిన పుస్తకాలెన్నో ఉన్నాయి. గాలి గుర్తులు పుస్తకంలో వచ్చిన హైకూలు కొన్ని.... 1 ఎక్కడుంటే ఏం నీతో మాట్లాడుతుంది నా కవిత 2 క్లోనింగ్ పద్ధతిలో పిల్లలు విశ్వాసం నేర్పుతుందా కుక్క? 3 ప్రజల భయం రక్షణ కవచంగా భక్తి 4 ఆకలి తీర్చింది ప్లాట్ ఫాంపై వాసులకు దిష్టి గుమ్మడి 5 ఆస్వాదిస్తున్నారు ఆత్మహత్యను సూర్యాస్తమానాన్ని 6 రోడ్డుపై అడ్డంగా నత్త ట్రాఫిక్ రూల్స్ తెలీదు 7 స్నేహాన్ని నాటు పండుతుంది మానవత్వ పంట 8 మోయలేని వయస్సు లాలిపాటై ప్రేమ అమ్మ జ్ఞాపకం 9 వస్తుమార్పిడి వ్యాపారం వరకట్నం 10 వర్ణాలకు ప్రాణం పోశాడు చిత్ర విధాత 11 బహుదూర బంధమే అమ్మ విదేశంలో ఉద్యోగం 12 గోడ మీద రాసుంది గోడమీద ఎవరూ రాయకండని 13 ప్రపంచ బ్యాంకులో రుణగ్రహీతలు భారతదేశ రాజులు 14 పేదోడి ఇంట చెరగని విజ్ఞానవేత్త దారిద్ర్యం 15 నిద్దట్లో విద్యార్థులు పర్యవేక్షణలో కాకులు చెట్టుకింద తరగతి - యామిజాల జగదీశ్ (మూలం - తమిళం తెలుగు అనువాదం)
July 28, 2020 • T. VEDANTA SURY • Book Review