ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
గిడుగు సీతాపతి.వేదికనుండి-వెండితెరకు.--డా.బెల్లంకొండ నాగేశ్వరరావు. 9884429899.
October 14, 2020 • T. VEDANTA SURY • News

1885 / జనవరి/28న విశాఖపట్నం జిల్లా భీముని పట్నంలో రామూర్తి,అన్నపూర్ణమ్మగార్లకు జన్మించారు.1909లో 'చిలకమ్మపెళ్ళి' -'రైలుబండి'బాలగేయాలు రాసారు.'వివేకవర్ధిని'అనే పత్రికలో వీరివి పలుగేయాలు ప్రచురితం అయ్యాయి.
భారతి పత్రకలో 'బాలానందం'శీర్షికన 1940 ఏప్రిల్ నుండి ప్రచురించారు.1950లో వీరిరచన 'బాలానందం'రాష్ట్రప్రభుత్వ అవార్డు అందుకుంది. అనేక బాలసాహిత్య శిబిరాలు నిర్వహించారు. మద్రాసులో పట్టభద్రులైన వీరు పర్లకిమిడిలో చరిత్రోపన్యాసకులుగా ఉన్నారు. వ్యవహారిక భాష అమలుకై తండ్రికి మద్దత్తుగా కుడిభుజంలానిలిచారు.
1896-98మధ్యకాలంలో వీరు విరివిగా నాటకరంగానికి సేవలు అందించారు.మద్రాసులో 'రామదాసు'నాటకంలో తానీషా, వెంకట రాయశాస్త్రీ గారి'ప్రతాపరుద్రీయం' చాకలి పేరిగాని పాత్రధరించి అమోఘంగా నటించారు.గూడవల్లి రామబ్రహ్మంగారు వీరినటకు అబ్బురపడ్డారు.
1945 లో మాగంటివిజయ బాపినీడు సంపాదకీయంలో వెలువడిన 'ఆంధ్రాసర్వసమునకు అనేక వ్యాసాలు రాసి తోడ్పడ్డారు.1949లో 'తెలుగు భాషా సమితి'ఏర్పడినప్పుడు తెలుగు విజ్ఞాన సర్వసపు సంగ్రహకులుగా నియమితులైనారు.సూర్యరాయాంధ్ర నిఘంటువుకు చివరిదశలో గౌరవసంపాదకులుగా పనిచేసారు.కేంద్రసాహిత్య ఆకాడమి సకలితంచేసిన జాతీయ గ్రంధసూచికలో తెలుగు విభాగానికి సంపిదకీయం వహించారు.
వీరి రచనలు 'భారతీ శతకము' 'కట్టబొమ్మ' 'బాలానందం' 'సరస్వతివిలాసము' తెలుగు సాహిత్య చెరిత్రను ఇంగ్లీషులో అనువాదించారు.'తెలుగులో ఛందోరీతులు'అనేవీరి రచనకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య ఆకాడమి వారిపురస్కారం లభించింది.
'మాలపిల్ల'(1938)'రైతుబిడ్డ'(1939)'భక్తిమాల'(1941)'పంతులమ్మ' 'మాయాలోకం' 'స్వర్గసీమ'(1943)'పల్నాటియుద్ద'(1947)వంటి చిత్రాలలో నటించారు.
వీరికి ఆంధ్ర విశ్వ విద్యాలయం 'కళాప్రపూర్ణ'బిరుదు గౌరవ డాక్టరేట్ ప్రదానంచేసింది.జిల్లా బోర్డు,మునిసిపల్ కౌన్సిలర్,సెనేట్ సభ్యులుగా,సిద్ద భాషా పరిశోధకుడిగా,విజ్ఞనసర్వస్వ నిర్మాతగా, తొలితరం బాలసాహీతీవేత్తగా,వ్యవహరిక భాషా వేత్తగా, సాహిత్య,భాషా పరిశోధకుడిగా, రంగస్ధల,సినీ నటుడిగా,రచయితగా,ఉపాధ్యాయునిగా వెలుగొందినఈ బహుముఖ ప్రజ్ఞాశాలి 1969/ఏప్రిల్/19 న హైదరాబాద్ లో తుదిశ్వాస విడిచారు.