ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
గుణపాఠం ...--డా .కె .ఎల్ .వి.ప్రసాద్ ,హనంకొండ ,వరంగల్ -9866252002*-8886991785
October 4, 2020 • T. VEDANTA SURY • Poem

కరోనా వైరసు 
కసితీరా ...
విజృంభించి ,
ప్రపంచాన్నే ,
శాశిస్తున్నది 
ప్రజలందరినో 
పొట్టన ...
పెట్టుకుంటున్నది.!

మేము గొప్ప 
అని విర్రవీగిన 
ప్రపంచ దేశాలను ,
మరోమాటకు 
తావులేకుండా ,
నోరు----
మూయించిం ది !

ప్రపంచ ....
జీవనవిధా నాన్నే ,
అస్తవ్యస్తం చేసిన ,
ఈ మహమ్మారి ,
ఎన్నెన్నో ....
జీవిత గుణపాఠాలను 
నేర్పింది ...!

మానవాళిని 
మట్టుపెట్టడానికి ,
అణ్వస్త్రాల వంటి 
పెద్ద ప్రయోగాల ,
అవసరంలేదని 
తేల్చి చెప్పింది....!!