ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
గురజాడను ఆధునిక భాషా సాహిత్యాల యుగకర్త అని ముందుగానే చెప్పుకున్నాం. తెలుగు భాషా సాహిత్యాలలో గురజాడ పెద్ద మార్పును తీసుకువచ్చారు. సామాన్యప్రజలు చదువు కొనేందుకు వీలుగా రచనలు చేయడం, మొట్టమొదటిసారిగా ఆధునిక భాషలో అందరికీ అర్థమయ్యే రీతిలో "దిద్దుబాటు'' అనే మొదటి కథను 1910 ఫిబ్రవరిలో వ్రాసారని సాహిత్య వేత్తలు, విమర్శకులు చెప్పుకుంటారు. కానీ ' మెటిల్డా' అనే కథ 1895లోనే గురజాడ వ్రాసినట్టుకొన్ని ఆధారాలను బట్టి తెలుస్తోంది. గురజాడ దిద్దుబాటు కథను వ్రాసిందే మరోసారి వ్రాయడం జరిగింది. దీనికి కారణం మొదటిసారి వ్రాసిన దిద్దుబాటు కథలో అక్కడక్కడగ్రాంథిక పదాలను వాడకం చేసినట్లు గురజాడ కొన్ని రోజులతరువాత గుర్తించారు. ఆ కారణంగా గురజాడ స్వహస్తంతోదిద్దిన లిఖిత ప్రతి లభించింది. ఈ ప్రతిలో కథపేరు "దిద్దుబాటు" కాదు " కమిలిని" అన్న విషయం " గురజాడ రచనలు" (కథానికలు) అన్న గ్రంధంలో చెప్పబడింది. ఈ రెండు " దిద్దుబాటు" కు సంబంధించిన కథలు చదివితే మొదటి కథలో ఉన్న గ్రాంథిక పదాలు, ఆ పదాలతోనున్న వాక్యాలు కొన్ని తొలగించబడ్డాయి. అక్కడక్కడ కొన్ని చేర్చబడ్డాయి. " దిద్దుబాటు" కథలో గోపాల్రావు అనేవాడుంటాడు. అతనికి కమిలిని అనే భార్యఉంటుంది. అలానే రాముడు అనే పనివాడుంటాడు.గోపాలరావుకు సానికొంపలకు వెళ్ళే అలవాటుంది. సానిదాని పాటను, నాట్యాన్ని చూసుకుని సానిదానిపై మనసు లగ్నంచేసుకుని సానికొంపలోనే ఉండిపోయి రాత్రి ఒంటి గంటకు ఇంటికి వచ్చి తలుపు తెరవమంటాడు. గానీ ఎవరూ తలుపు తెరవలేదు. ఆలస్యమైనందుకు తనకు తానే నిందించుకుంటాడు. మరుచటి దినం నుండి వెళ్లకూడదనినిశ్చయించుకుంటాడు. గట్టిగా పిలిస్తే కమిలిని ఎక్కడ లేచిపోతుందోనని రాముడిని లేపి చడీ చప్పుడు కాకుండామంచం ప్రక్కపై చేరి పెద్దమనిషిలా నిద్రపోదామ నుకుంటాడుగోపాలరావు . తను తలుపును చేతితో ఇలా అనేసరికే తలుపు తెరుచుకుంటుంది. ఇదేమిటి తలుపు ఇలా అనేసరికి తెరుచుకుంది అనుకుంటాడు గోపాల్రావు. నడవాలోగానీ, ఇంట్లోగానీ దీపంలేదు. భార్య కమిలిని మేల్కొని ఉన్నదా, నిదురపోతున్నదా అనే సంశయంలో పడ్డాడు. అగ్గిపుల్ల తీసి వెలిగించి చూసాడు. మంచం మీద కమిలిని లేదు. వ్యాకులత చెందాడు గోపాల్రావు బయటకు వచ్చి చూసాడు. నౌకరుగానీ, దాసీగానీ కనిపించలేదు. గోపాల్రావు వీధి గుమ్మం దగ్గరకు వెళ్లి చూసేసరికి కుమిలిని గురించి వాకబు చేసాడు.అమ్మగారు గదిలోనే పడుకున్నారు అంటాడు నౌకరు. అమ్మగారిని ఒక్కర్నీ విడిచి అర్థరాత్రి వేళ సానమ్మగారింటికి వెళ్తేఎలా అంటాడు. దాంతో గోపాల్రావుకు పట్టరాని కోపం వచ్చి రావుడు వీపు మీద గట్టిగా రెండు గుద్దులు వేస్తాడు. ఆ దెబ్బలు తట్టుకోలేక రాముడు క్రిందపడిపోతాడు. గోపాల్రావు పశ్చాత్తాప పడి రావుడిని లేవనెత్తుతాడు. ఇక్కడ గురజాడ పనివానికి, యజమానికి గల అనుబంధాన్ని చూపిస్తాడు. ఇంట్లో టేబుల్ మీద కుమిలిని చేవ్రాలుతో ఒక ఉత్తరం దొరుకుతుంది. ఆడవాళ్ళకు చదువు ఎందుకులే బాబు అన్న పద్ధతిలో రావుడు మాట్లాడతాడు. దానిని ఖండిస్తూ " విద్యవిలువ నీకేం తెలుసంటాడు. కమిలిని వ్రాసిన ఉత్తరంలో భర్త చేసే తప్పుడు పనులన్నీ ఎత్తి చూపుతూ తను రోజూ ఎంతమానసిక క్షోభననుభవిస్తున్నదీ ఆ ఉత్తరం ద్వారా వివరి స్తూంది. రావుడు, గోపాల్రావు మధ్య కథంతా సరదాగా, హాస్యపూరితంగా నడుస్తోంది.గురజాడ ఈ కథలో స్ర్తీకివిద్య ఎంత అవసరమో చెబుతాడు. చెడు అలవాట్లున్న వాడు ఒక్క భార్య దృష్టిలోనే చులకనవ్వడమే గాకుండా పనివాళ్ళ దృష్టిలో కూడా చులకనగా చూడబడతాడన్న విషయాన్ని మనం గ్రహించాలి. గురజాడ ఈ దిద్దుబాటు కథలో విద్యా వంతురాలైన భార్య తన సంసారంలో వచ్చే ఆటుపోట్లను ఇంట్లో నుండి ఎక్కడకూ వెళ్లకుండానే ఎలా పరిష్కరించుకో గలిగిందో గురజాడ తన మొదటి కథలోనే తన సత్తా చూపించాడు. ఈ కథ ఆద్యంతమూ హాస్యపూరితమైన సంభాషణలతో నడుస్తోంది. చివరకు విద్యావంతురాలైన కమిలిని తన మెదడుకు తట్టిన చిన్న ఆలోచనతో ( భర్త దుర్వ్యసనాలను లేఖ ద్వారా ఎత్తి చూపి, మంచం క్రింద దాక్కుని కథను రక్తి కట్టిస్తుంది ). అందరూ చదవదగ్గ కథే ! ( సశేషం) శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్ : 701 3660 252.
August 6, 2020 • T. VEDANTA SURY • Memories