ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
గురజాడవారి " సంస్కర్త హృదయం " కథలో రంగనాథయ్యరు సంస్కరణవాది. ' సరళ ' తన తరగతి విద్యార్థిని.. ఆమె భోగంపిల్ల అనీ, ఆమె తెలివితేటలు, వివిధ రంగాలపై ఆమెకు గల ఆశక్తి, అనుభవం ప్రొఫెసర్ రంగనాథ య్యరుతో సహా అందరికీ తెలుసు. ప్రొఫెసర్ సరళను రోజూ తరగతి గదిలో చూస్తుంటాడు. ఈ పిల్లపై చందర్ అనే విద్యార్థి 'మానవ పరిణామ శాస్త్ర పరిశోధన' కై ప్రయోగాలు చేస్తున్నాడనీ, అలా ప్రయోగాలు చేస్తున్నందుకు సహచర విద్యార్థులలో కొందరు అతనిని మెచ్చుకున్నవారైతే, మరి కొందరు మెచ్చుకోని విద్యార్థులు ఉంటారు. క్లాసులో విద్యార్థులు రెండువర్గాలుగా చీలిపోతారు. ఎందుకు అలా విడిపోయారో తెలుసుకున్న రంగనాథయ్యరు ప్రోనాచ్ వాదుల మీద కోపోద్రిక్తుడవుతాడు. సరళ గురించి ఇంత తెలిసిన ప్రొఫెసర్ ఆమె దేవాలయానికి వచ్చేసరికి మొదటిసారే ఆ అమ్మాయిని చూసినట్టు యెర్రెత్తిపోవడం, ఆ చిన్నది ఎవరై ఉంటుందా అని మిత్రుల ముందే పిచ్చివానిలా అరవడం అర్థవంతంగా లేదు. ' ఇంతటి అందమైనమనిషి సంగతి తెలుసుకోవాలనే కుతూహలం రానురానుఅతనికి (రంగనాథయ్యరుకు) మిక్కుటమైంది. కుతూహలంకోరికగా మారింది. మనసు మనసులో లేదు. అతని అంతరాత్మ ఇలా ప్రశ్నించింది "ఆవిడ ఎవరో తెలుసుకునేం దుకు నీకెందుకా ఆరాటం ?" అని. ఆవిడ ఎవరో? ఏమిటో ?ప్రొఫెసర్ కు తన విద్యార్థిని సంగతి తెలుసు. అలా తెలిసి కూడా ఇంత ఆరాటం దేనికో ? భోగంపిల్ల అందాలకు బంధీగా మారాలనే కోరిక దేనికో ? " భోగంపిల్ల సరళ కనిపించగానే సరళ కోమల శరీరం క్షణ క్షణం అతని మనసును పీడిస్తున్నది. విశ్వాసాలను వమ్ము చేస్తున్నది. సుందరమగు వస్తువు ఎల్లప్పుడూ ఆనందదాయక మగును." ఇది ప్రముఖ ఆంగ్లకవి జాన్ కీట్స్ చెప్పిన " A thing of beauty is joy forever" అనే మాటలకు స్వచ్ఛమైన తెలుగు అనువాదం గురజాడవారు చేసారు. ఈ కథకు మకుటాయమానం అయిన కొన్ని వాక్యాలను గురజాడ వారు ఇలా పేర్కొన్నారు. " పిల్ల భోగం కులంలో జన్మించి నంతమాత్రాన మానవులు ఆమెను ఏవగించుకొని నేరస్తురాలిని శిక్షించినట్టు శిక్షించవచ్చునా ? లోకంలో అనేకమంది దురదృష్టవంతులను కనికరిస్తున్నట్టు ఆమెను కనికరించలేమా ? భోగం వారిని మానవులు ఎందుకు దయతో చూడకూడదు. సరళ వంటి అందగత్తెను విచ్చల విడిగా విహరింపనిస్తే సంఘమూ పాడవుతుంది, ఆవిడా చెడిపోతుంది.ఆమెను నిర్లక్ష్యం చేయకూడదు. ప్రేమను, కరుణను, తెలివినీ, చివరకు ధనాన్నైనా సరే ధారపోసి ఆమెను రక్షించాలి. భోగం పడుచుతో మాట్లాడితేనే మహాపాపం అనుకోవడం చాలా తప్పు. సమాజ రుగ్మత లకు చికిత్స చేయవలసిన. డాక్టర్ సంఘసంస్కర్తే ! " అని. అయితే గు‌రజాడ ఉద్దేశం మంచిదే అయినా ప్రొఫెసర్ పాత్ర ద్వారా గురువు సంఘసంస్కరణోద్యమం పేరుతోతన విద్యార్థినిపై అలవిగాని కోరికలను పెంచు కోవడంగురువు స్థానానికే మాయని మచ్చ.ఇవి ఎలా ఉన్నాయంటేచెప్పేవి శ్రీరంగ నీతులు- దూరేవి దొమ్మరి గుడెసెలు అన్నట్లు. ప్రొఫసర్ చెప్పేది సంఘసంస్కరణ. కానీ తన ప్రవర్తనను, తనలోనున్న రుగ్మతలను సంస్కరించు కోలేనివాడు సమాజంలో నున్నరుగ్మతలను తనేం సంస్కరిస్తాడు అనిపిస్తుంది రామనాథ య్యరు పాత్రను చదివితే ! ఒకనాడు రంగనాథయ్యరు తన కాలేజీ ప్రిన్సిపాల్ ను కలసి " సమాజానికి అతి ప్రమాదకరంగా పరిణమించిన భోగం పిల్లను చూసి కొంత పరీక్షిస్తాను " అంటాడు. అలా అనేసరికి ప్రిన్సిపాల్ గతుక్కుమని. " మనోవికారాలకు లోనుకాకూడదు ప్రొఫెసర్ ! మనలాంటి. వాళ్ళం ఆకర్షణల దరిదాపులకైనా పోరాదు." అంటాడు. ప్రిన్సిపాల్ అలా అనేసరికి ప్రొఫెసర్ గారి ముఖం వివర్ణమైపోయింది. గొంతులో రోషం ప్రతిధ్వనించింది. " నా దారిని ఎంతటి విషయలోలుడు అనుసరించినా మారకమానడు "అంటాడు ప్రొఫెసర్. ప్రిన్సిపాల్ అతనిని తన సోదరునిగా అభిమానిస్తున్నాడు. కన్నకొడుకులా ప్రేమిస్తున్నాడు. ప్రొఫెసరుది రసార్ద్ర హృదయం. ఏం ప్రమాదం తెచ్చిపెడుతుందోనని ప్రిన్సిపాల్ భయపడ్డాడు. ప్రిన్సిపాల్ మాటలుప్రొఫెసరుకు ఒక ప్రక్క ఆశీర్వదించినట్టుగా మరో ప్రక్క హెచ్చరించినట్లుగా అనిపించింది. దాంతో తన ఆత్మగౌరవం కొంతవరకూ దెబ్బతింది. పతితులనుద్ధరిద్దామని రంగనాథ య్యరు బయటకు చెప్పుకొస్తున్నా తన మనసులో ఒక నిగూఢమైన కోరికపుట్టుకొచ్చి తనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ది. ఆ బలమైన కోరికే సౌందర్యరాశి సరళపై తన మనసు మళ్ళడం. క్షణక్షణా నికి ప్రొఫెసర్ ఆలోచనలు మారుతు న్నాయి. తనకు ప్రత్యామ్నాయంగా ఎవరినైనా సరళలో మార్పుతెచ్చే సత్కార్యసాధనకు పంపాల నుకొని విశ్వనాథశాస్త్రి అనే మిత్రుని ఎంచుకుంటాడు.అతను మహా పండితుడు. సమయాసమయాలనుబట్టి జాగ్రత్తగా ప్రవర్తిస్తూ ఎదుటివారి అభిప్రాయాలను గౌరవిస్తుంటాడు. అయితే డబ్బు చేతిలో పడాలి. అలా అయితే ఎంతటివిరుద్ధ విషయమైనా శాస్త్ర సమ్మతమేనని సమర్ధించగలడు.పెద్ద మొత్తంలో శాస్త్రిగారికి ప్రొఫెసర్ సొమ్ములందజేసాడు. శాస్త్రి సరళ దగ్గరకు వెళ్ళి భగవద్గీత చదివి వ్యాఖ్యానంచెప్పాడు. స్ర్తీల ప్రాతివత్యాల గురించి సరళ తనూ కలసి చదివారు. భోగం సమస్య మీద చర్చలలో శాస్త్రిగారిపై ఆమె విజయాన్ని సాధించింది. చంద్రవంశపు రాజుల నెత్తురు సానివాళ్ళదే కదటండీ అని శాస్త్రులవారిని సరళ ప్రశ్నిస్తుంది. దాంతో శాస్త్రిగారి నోరు మూతపడిపోయింది.పాఠకుల దృష్టిలో రంగనాథయ్యరే విషయలోలుడుగా కనిపిస్తు న్నాడు. సరళ భోగం పిల్ల అని తెలిసికూడా తన అందానికి ప్రొఫెసర్ దాసోహమైపోయాడని తనూ, తన స్నేహితులు బయటకు అనకపోయినా అందరూ గుర్తించారు ! ( సశేషం )శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్ : 701 3660 252.
August 11, 2020 • T. VEDANTA SURY • Memories