ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
గురజాడవారి " సౌదామిని " కథలో స్ర్తీల సమస్యలగురించి లోలోతులకుపోతూ ఉంటే ఆలోచనలు చాలా ఉన్నాయి. రచయిత మొదటి జట్కా బండి ఎక్కి అది సరిగా నడవక పోవడంతో కొంత దూరం వెళ్లిన తరువాత ఆ చోట దిగి మరో జట్కా బండి ఎక్కుతాడు. ఈ గుర్రం అతి వేగంగాపరుగు తీస్తుంది. మళ్లీ మరో కొత్త బండి ఎక్కుతాడు రచయిత. ఇంతలో వానజల్లు వస్తుంది. ప్రయాణం చేస్తున్న రచయిత ఒక మిత్రుని దుకాణం దగ్గర దిగిపోతాడు. రచయిత ఇలా బండి దిగాడోలేదో జట్కావాడు మహా వేగంగా బండిపోనిచ్చాడు. అలా చేసినందుకు రచయితకుబండివానిమీద చాలా కోపం వచ్చింది. అంతేకాదు. ముక్కు మొహం తెలియని ఒక స్ర్తీగురించి అంత ఆరాటం దేనికోనని తన మీద తనకే కోపం వచ్చి తనను తాను నిందించుకు న్నాడు. వర్షంలో తడిసిన రచయిత ఆ దగ్గరలోనున్న ముస్లీం దుకాణాలకు చేరుకున్నాడు. ఆ ముస్లీం దుకాణాల యజ మానులలో కొందరు రచయిత స్నేహితులున్నారు. ఒక ముస్లిం స్నేహితుని దుకాణంలోకి వెళ్ళాడు. ఆ దుకాణం యజమాని వర్షంలో తడిసిన రచయితను అతి ఆశ్చర్యంగా చూసి బట్టలు మార్చుకోమని ఇచ్చి వేడి కాఫీ తెచ్చి ఇస్తాడు. రచయితకంటే ముందుగా వచ్చిన కవి గురించి, తన జట్కా ప్రయాణం గురించి సాయిబ్ తెలుసుకొని నవ్వుకుంటాడు.రచయిత కవి ఉన్న బసకు వెళ్ళాలని అనుకుంటాడు. కవి ఎక్కడ ఉన్నాడో రచయితకు తెలియదు.తన బస గురించి ఆలోచిస్తుండగా జోడు గుర్రాల బగ్గీ ఒకటి దుకాణం దగ్గరకు వచ్చి ఆగింది. ఏభైయేళ్ళ ముస్లమాన్ లా ఉన్న ఒకతను పని మీద దుకాణంకు వచ్చి రచయిత గురించి తెలుసుకు న్నాడు. ముస్లమాన్ స్నేహితులు ఎవరైనా తన ఇంట్లోఉండొచ్చు. భోజనం కూడా చెయ్యొచ్చని చెప్తాడు. బగ్గీ ఎక్కమన్నాడు రచయితను. ఆ బగ్గీలో ఆడవాళ్లున్నారు. రచయిత బగ్గీ ఎక్కడానికి తటపటాయించాడు. అయినాముస్లమాన్ ప్రోత్సాహం వల్ల రచయిత బగ్గీ ఎక్కి ఆడవారిని తాకకుండా కూర్చున్నాడు. వర్షం పడుతూనే ఉంది. అనేక మలుపులు తిరుగుతూ జోడుగుర్రాల బగ్గీ పరుగెడుతూ, పరుగెడుతూ దీపాలతో మెరిసిపోతున్న ఒక ఇంటిముందుఆగింది. రచయితతో సహా మరికొందరు బండి దిగారు. ఇంతలో అక్కడున్న వెలుగులో బండిలోనున్న ఇద్దరు స్ర్తీలు రచయిత. కంటపడ్డారు. ఒకామె కొద్ది వస్తువులతో నిరాడంబరంగా ఉంది. మరొకామె ఒంటినిండా నగలతో తళతళ మెరిసిపోతుంది. రచయిత ఆమెను ఎగాదిగా చూస్తూ మర్యాదగా ఉండదని మొఖం మరల్చుకున్నాడు. రచయిత ఒక మహా సౌధంలోకి వచ్చి కుషన్ కుర్చీలో కూలబడిపోయి మనోజ్ఞ మైన వెన్నెల దృశ్యం పరిశీలించ సాగాడు. (సశేషం )శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్ : 701 3660 252.
August 17, 2020 • T. VEDANTA SURY • Memories