ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
గురజాడవారు తన కవితల సంపుటిలో " ముత్యాలసరాలు" శీర్షికతోను " ముత్యాల సరము* అన్న శీర్షికతోను వేర్వేరు కవితలు వ్రాసారు. ప్రముఖ రచయిత, విమర్శకుడు, డాక్టర్. యు.ఎ.న‌రసింహమూర్తిగారు గురజాడవారి కథాత్మక కవిత " ముత్యాలసరాలు" గురించి వ్రాస్తూ " అదొక చిన్న కవితా సంపుటి. అయినా గురజాడ మాటల్లో చెప్పాలంటే అది ' వితత కవితా ఖని' అని చెప్పాలి అంటారు. నిజంగా దానిని చూసిన'కుమతి' కి కనుచెదురుతుంది.'మతి యుతు డు కవితల సాంపున్ చతురత నెరిగి గనున్'అన్నాడు గురజాడ.ఆ చాతుర్యంతో చూస్తే అంత చిన్న కవితా సంపుటిలో ఏ ఇతర సంపుటిలోనూ లేనన్ని ప్రక్రియా బేధాలున్నాయని తెలుస్తుంది. ఆయన మచ్చుకొకటి అన్ని ప్రక్రియలను చూపించడానికి ఇవన్నీ వ్రాసాడా అని అనిపిస్తుంది. తెలుగు కవిత్వం ఆయన చివర దశలో వ్రాసాడు.కానీ అందులో కూడా కొత్తపాతల మేలుకలయిక క్రొమ్మెరుంగులు చిమ్మింది" అంటారు. గురజాడ ఆనంద గజపతి దర్బార్లో ఉండేవాడు. అతను సంస్కృతం, ఆంగ్లము లలో దర్బార్ చేసేవాడు. అతనితోపాటుగా ఉర్దూ, పారశీక భాషలలో కూడా కవి పండితులుండేవారు. ఆనంద గజపతిరాజు దర్బార్ లో నున్న అందరిపండితులతో చర్చలు జరిపేవాడు. గురజాడ ఆయననుసరించి ఉండేవాడనీ, ఆ కారణంగా ముత్యాలసరాల మీద పారశీ గజళ్ళ ప్రభావం ఉందని గురజాడ తెలియజేసాడు అని యు.ఎ.నరసింహ మూర్తిగారి రచన " కన్యాశుల్కం" 19వ శతాబ్ది ఆధునిక భారతీయ నాటకాలు అనే గ్రంథం ద్వారా తెలుస్తుంది. ఇక " ముత్యాలసరము" అనే కవితలు1912లో ఐదవ జార్జ్ ఢిల్లీ రాక సందర్భంగా గురజాడచే వ్రాయబడి నది. ఇందులో ఏడు కవితలుంటాయి.ఏడు కవితలు ఐదవ జార్జ్ ను పొగుడుతూ వ్రాయబడినవే ! ఒక పాశ్చాత్య దేశస్థునికి అంతగా పొగడ్తలతో ముంచెెత్తడం గురజాడ లాంటి మహాకవికి తగునా అనిపిస్తుంది. ( సశేషం )-- శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలిఫోన్: 701 3660 252.
July 23, 2020 • T. VEDANTA SURY • Memories