ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
గురజాడవారు రచించిన కథలలో అతిపెద్దదైన కథ -'సంస్కర్త హృదయం.'కథా పరంగా చూసుకుంటే అత్యంత విలువలతో కూడుకున్న కథ. గురజాడ కథలన్నీ ఒక ఎత్తు,'సంస్కర్త హృదయం' ఒక ఎత్తు. ప్రొఫెసర్ రంగనాథయ్యర్ పాత్ర ఒక గొప్ప సంస్కరణవాది పాత్రగా గురజాడ సృష్టించిచివరిలో అదీ ఆఖరి అయిదు నిముషాలలో కథ ముగుస్తుం దనగా కథ మలుపు తిప్పాడు. రంగనాథయ్యర్ దృఢ చిత్తంకలిగినవాడు, ఎవరికీ జంకనివాడు, వేశ్యావృత్తిని సమూలం గా రూపుమాపాలనే కాంక్ష కలిగినవాడు. నైతిక పతానవస్థనుంచి దేశాన్ని రక్షించబవలసినవారు విద్యార్థులే అన్న భావం కలిగినవాడు.విద్యార్థుల మీద తనకు ఎంతదృఢమైన విశ్వాసముందో అంతకన్నా అతని క్లాసుల్లో అతని చేసే ప్రసంగాలు, ప్రభోదాలపై విద్యార్థులకు అంత శ్రద్ధ, జాగరూ కత ఉండేవి. రంగనాథయ్యరుకు ఉండే లక్షణమేమంటే తను పాఠం చప్పేటప్పుడు విద్యార్థి చేనులో పడ్డ గుడ్డెద్దుఉండి అన్నింటికీ తల ఊపేయకూడదు. అటువంటి విద్యార్థి అంటే ఈ ప్రొఫసెరుకు గిట్టేదికాదు. ఆయన చెప్పే ప్రతీ విషయాన్ని ఆచితూచి ఆలోచించి, పరీక్షించి అడిగి తెలుసుకోవాలంటాడు. ' సరళ ' అనే అమ్మాయి తన తరగతిలో చదువుతుంది. ఆ అమ్మాయి భోగం పిల్ల. చాలా చాలా అందగత్తె. ఆడది అంటేనే చొంగలు కార్చుకు చచ్చే యెర్రి నాకొడుకులున్న ఈలోకంలో అందమైన ఆడది, మరీ అందమైన ఆడదాన్ని చూస్తే ఎంత పడి ఛస్తారో మనందరికీ తెలుసు. మగవాడు ఆడదాన్ని ఆకర్షించడం, అలాగే ఆడది మగవాడిని ఆకర్షించడం సృష్టిలో భాగమైనా సమాజిక పరంగా నాగరికతా సమాజం ఏర్పడినప్పటి నుండి కొన్ని నీతి నియమాలు, కట్టుబాట్లు ఏర్పరచబడ్డాయి.మానవ జీవితం, సంస్కృతులు ఏర్పడినప్పటి నుండి సంస్కారవం తులు, సంస్కారహీనులు అనే రెండు వర్గాల ప్రజలున్నారు. 'సరళ ' చాలా అందమైన విద్యార్థిని. పైగా భోగం పడుచు. ఒక భోగం పడుచును, మైక్రోస్కోప్ ముందుంచి, ఎనలైజ్ చేసి చూస్తేనే తప్ప అమీతుమీ తేల్చుకోరాదు. ప్రయోగం, పరిశోధన, రుజువు సాధ్యపడనిదే ఏదీ సిద్ధాంతంగా చెప్పకూడదు అంటాడు ప్రొఫెసర్. ఊరందరి మనసూ ఆమెపై పడేది. చక్కని మనిషి. తీయని కంఠస్వరం, శాస్త్రీయ సంగీతం బాగా నేర్చుకుంది. అందంగా వీణను మీటుతుంది. ఏయే సమయాలలో సందర్భాన్ని బట్టి పాటలు, పద్యాలు పాడటం నేర్చుకుంది.సంస్కృత శ్లోకాలు,తెలుగు పద్యాలు, కృతులు ఆమెకు బాగా వచ్చును.ఇన్ని విద్యలలో ఆరితేరిన సరళ పై అదే తరగతిలోనున్న ' చందర్' అనే భూస్వామిక అబ్బాయి విద్యార్థిగా ఉంటూ సరళ పై ' మానవ పరిణామ శాస్త్ర పరిశోధనకై ప్రయోగాలు చేసేవాడు. ఈ పరిశోధనలు ఎప్పటికీ పూర్తయ్యేవికాదు. ఇతని పరిశోధనలకు ఎప్పుడూ కొత్త సమస్యలు పుట్టుకొచ్చేవి. దాంతో శాస్త్ర తృష్ణ అతనిలో అధికమయ్యేది. లేబరేటరీ అగరు అత్తరులతో నిండి ఉండేది. కొందరు విద్యార్థులకు ఈ అగరు అత్తరుల సుగంధం లేబరేటరీలో నిండి ఉండడం చాలా ఆనందం అనిపించేది. అటువంటి విద్యార్థులు అతని పక్షాన చేరారు. దానితో తరగతి విద్యార్థులు రెండు వర్గాలుగాచీలిపోయారు. ఎందుకిలా జరిగిందో ప్రొఫెసర్ తెలుసుకొన్నాడు. ప్రొఫెసర్కు వేశ్యల మీద అతనికుండే క్రోధం, అసాధారణమైన స్ర్తీలలో ఉండే అలసత్వాన్ని చూసి ఉపయోగించుకుంటున్న ప్రోనాచ్ ల మీద తీవ్ర ఆగ్రహాన్ని వెళ్లగక్కేవాడు. అయితే గురజాడ వ్రాసిన కథ " సంస్కర్త హృదయం " లో 'చందర్' అనే ఒక భూస్వామిక అబ్బాయి భోగం పడుచు సరళపై " మానవప‌రిణామ శాస్త్ర పరిశోధనకై ప్రయోగాలు చేయడం( అందులో నూ ఒక విద్యాసంస్థ లేబ్ లో ) చాలా ఎబ్బెట్టుగా ఉంది. దీనిని పాఠకులు ఏవిధంగా గురజాడను సమర్ధిస్తారో నాకైతేఅంతుబట్టలేదు. ( సశేషం )శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్: 701 3660 252.
August 9, 2020 • T. VEDANTA SURY • Memories