ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
గురజాడ రచన శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్ : 701 3660 252.
August 25, 2020 • T. VEDANTA SURY • Memories

శాస్త్రిగారి శిష్యులు రామగిరి వెళ్ళారు. ఆ ఊరు వెళ్లేసరికి జంగాలు పూజచేసే పాలరాతి బుద్ధ ప్రతిమను గూర్చిఊరంతా కోలాహలంగా ఉంది. ఆ బొమ్మ బహు సొగసైనదనిశిష్యులతో సహా అక్కడ ఉన్నవారంతా మెచ్చుకుంటారు. 'దొర ' గారి కళ్లు ఆ పాలరాతి బుద్ధ ప్రతిమపై పడి దానినితనకు కావాలంటాడు. శైవులలో పెద్దలు " ప్రాణములైనా ఇస్తాము గానీ ఆ ప్రతిమను ఇవ్వజాలము " అని కరాఖండిగా  (ఖచ్చితంగా) చెప్పారు. దొరగారు అప్పటితో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. ఒకనాటి రాత్రి పూజారి జంగం శరభయ్య, ఆ పాలరాతి  బుద్ధ ప్రతిమను బయటకు తీసి దొరగారికి దొంగతనంగా రెండువందల రూపాయలకు అమ్మ జూపాడు. పూజరి దొంగతనంగా ప్రతిమను తెచ్చినం దున   దొరగారు దానిని పూజారి నుండి తీసుకొనుటకు అంగీకరించ లేదు. పైగా దొర తనకు మాట వస్తుందని భావించి  ఆ  ప్రతిమను శరభయ్య నుండి తిరస్కరించడమే గాకుండా ఆరాత్రికి రాత్రి ఊరు పెద్దలను కబురు పెట్టాడు. అలా కబురు పెట్టడం దొర బుద్ధితక్కువతనంగా శరభయ్య భావించాడు.దొర కనుచాటుకాగానే మెట్టల వైపు పరుగులు తీసాడు. శరభయ్య ఈనాటి వరకూ ఎవరి కంటా కనిపించ లేదు. ఇక్కడ గురజాడ ' దొర ' పాత్రకు మానవునికున్న సహజ లక్షణాలను చూపించాడు. ఈలోకంలో  పుట్టిన  ప్రతీ మానవునడూ ఎంతటి ఉన్నత స్థానంలోనున్నా అందమైన వస్తువుని చూసేసరికి దానిని పొందుదామనే వాంఛ కలుగుతుంది.ఇది మానవునికున్న సహజ గుణం.అలాగే 'దొర' కు కూడా అందమైన ప్రతిమను చూడగానే దానిని పొందాలనే    కోరిక  కలిగింది. అయినా పెద్దల తిరస్కరణతో ఆ కోరికనుదొర విరమించుకున్నాడు. పూజారి ప్రతిమను దొంగతనంగా తెచ్చి ఇచ్చినా నైతిక విలువలతో కూడిన ' దొర' ఆ ప్రతిమ ను  తిరస్కరించాడు.  పైగా  ఊరి  పెద్దలకు  కబురు పంపి విషయాన్ని చెప్పి తన  నీతి, నిజాయితీలను తెలియజేసు కున్నాడు. గురజాడ ' దొర ' పాత్రకు ఉన్నత విలువలను కట్టబెట్టాడు. శాస్త్రిగారి శిష్యులు ' శాయన్న భుక్త ' గారి ఇంట్లో మూడు రోజులు బస చేసి ఆ ఊర్లోనే ఉన్నారు.శాయన్న భుక్త  శాస్త్రిగారి దగ్గర తర్కశాస్త్రం చదువుకున్నాడు.మంచి సాహిత్యమేగాక మంచి కవిత్వం కూడా అల్లుతాడు. ఒకనాడు రాత్రి శాస్త్రిగారి శిష్యులు భోజనం ముగించుకొని డాబా మీద నలుగురు కూర్చున్నారు. చిన్న గాలి రేగి తోటలో
కొబ్బరి మట్టలు అల్లాడడం ప్రారంభించాయి. ఆ ఎదురుగానున్న  దేవుడికొండ  ' బ్రహ్మాండమైన మహాలింగము ' వలే చీకటిని చీల్చుకుని మిన్నుముట్టి  మనిషి యొక్క అత్యల్పతను  సూచించుచు, యేదో చెప్పరాని చింతను, భీతిని మనస్సుకు కలుగజేయుచుండెను. శిష్యుల మనస్సులు గతకాలమునాటి స్థితిగతులను గూర్చిన ఊహలతో నిండి యుండెను.  ఆనాడు ఈ స్థలం ఎలా ఉండేదో, బౌద్దులు ఏమేం చేసేవారో అని అందులో ఒక శిష్యుడు ఆలోచనచేయసాగాడు. ఆ పీనుగులు వారిలాగే ఏడుస్తుండేవారని, మేడ మీద ఉండే  తమ ( శిష్యుల ) కంటే అద్వాన్నంగా ఉండేవారే మోనని పెళుసు గొంతుకతో వెంకయ్య అనే శిష్యుడు అరిచాడు. అలా అరిచేసరికి మరో శిష్యునికి కోపం
వచ్చి  " నా మెదడులో నేను ఊహించుకున్న బౌద్ధ ప్రపంచమును పెటుకు(ద్వేషముతో కూడుకున్న)మాటలాడి ఏల కలత పరచెదవు" అని అడిగాడు. శాస్త్రులవారు కల్పించు కొని  " బుద్ధుడు విష్ణావతారంకదా ఈ  జంగాలు శివున్నేల పూజిస్తున్నారు?" అని తన సంశయాన్ని వెళ్లబుచ్చారు. ఇంతలో ' శాయన్న భుక్త ' శాస్త్రులవారి సంశయాన్ని తీర్చడా నికి ఒక కథ చెబుతానంటారు. అలా అనేసరికి శాస్త్రులవారు "అయితే చెప్పు " అంటూ సరదా పడిపోయారు. శాయన్న భుక్త పొడుం పీల్చి  కథ చెప్పడానికి ఇలా ఉపక్రమిస్తాడు. (సశేషం)