ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
గురజాడ రచన : శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్ : 701 3660 252.
August 24, 2020 • T. VEDANTA SURY • Memories

గురజాడ వ్రాసిన కథ '' దేవుడు చేసిన మనుషుల్లారా!  మనుషులు చేేేసిన దేవుల్లారా! మీ పేరేమిటి?"అన్న  దీనికి మరో సంక్షిప్త నామము" మీ పేరేమిటి?" అన్నది. దీనిని "ఆంధ్రభారతి" అనే పత్రికలో1910 ఏప్రిల్, మే, జూన్ నెలల్లోప్రచురింపబడింది. ఇది మతములకు సంబంధించిన కథ. కథ ముందు భాగములోనే హిందూమతము, బౌద్ధమతము, క్రైస్తవ మతముల గురించి ప్రస్తావించడం జరిగింది. తరువా త  కథలో వైష్ణవులు, శైవుల భక్తి పారవశ్యం గురజాడవారుతెలియజేస్తారు. వివిధ మతాలవారు ఈ కథలో ఉన్నప్పటికీ ఇప్పటి వరకూ మన చెప్పుకున్న కథలో మత విభేదాలు కానరాలేదు. ఎవరి మతాల దేవుళ్ళను వారు ఆరాధించడము,    కలసిమెలసి జీవించడము  మనకు ఇప్పటివరకూ జరిగినకథలో కనిపిస్తుంది. ఘర్షణ వాతావరణం ఎక్కడా కనిపించ లేదు. గురువుగారు  తర్కశాస్త్రంను చదువుకున్నవారు. పురాణ గ్రంథములపై అభిమానము కలిగినవాడు. శిష్యులు బౌద్ధమత ప్రియులు.  పురాణములను చదవడానికి భయపడేవారు. బౌద్ధమత గ్రంథాలను చదువుతున్నారని శిష్యులపై గురువుగారు ఒకనాడు ఆగ్రహించారు. శిష్యుల కోరికపై గురువుగారు బౌద్ధమత గ్రంథాన్ని చదివి ఉపన్యసి స్తారు. బౌద్ధమతంలో నున్న విషయాలను గ్రహించి బుద్ధుని గురించి పుస్తకం చదివే వరకూ బుద్ధుని  మహిమ తెలియ లేదని,ఆ మహానుభావుడు (బుద్ధుడు)శ్రీమహావిష్ణు అవతార మేనంటారు గురువుగారు." ఇక ప్రస్తుత కథ'' అనే శీర్షికతో గురజాడ"మీపేరేమి?" కథను కంటిన్యూ చేస్తారు. రామగిరి అనే ఆధునికమైన విష్ణుక్షేత్రం ఉంది. ఆ ఊరి నల్లకొండల అంతటా బౌద్ధకట్టడాలు శిధిలమైఉంటాయి. అక్కడివారంతా వాటిని ' పాండవుల పంచలు'  అంటారు.  ఈదేశంలో పాండవులు  ఉండని గుహలూ, సీతమ్మవారు స్నానమాడని గుంటలూ లేవంటారు. అంతేకాదు అక్కడ ఒక పెద్ద గుహ ఉంటుంది. ఆ గుహలోనున్న బౌద్ధ విగ్రహమును  శివుడనీ, దాని ప్రక్కనున్న  దేవీ విగ్రహమును గౌరి అనీ జంగాలు పూజలు చేస్తారు. అయితే మనం ఇక్కడ ఒక విషయాన్ని గ్రహించాలి.వైష్ణవులు, శైవులుపూజించేది బౌద్ధ విగ్రహాలనే ! కొన్ని రోజులు తరువాత ఒక దొర, గుమస్తాలు, బిళ్ళ బంట్రోతులతోను వచ్చి మెట్టల పడమట నున్న ముదర మామిడితోటలో క్యాంపుపెట్టాడు. వందల కొద్దీ కూలీలను రప్పించి ఆ మెట్టల పడమట కొండలను తవ్వించాడు. ఆ త్రవ్వకాలను చూసిన ప్రజలు ధనంకోసం దొర త్రవ్విస్తున్నా డనుకొన్నారు. కానీ విరిగిన  ప్రతిమలూ, జిలుగు చెక్కిన రాళ్ళు, పాతుకుపోయిన పాతకుండలను బళ్ళ మీదకు పెరిగి ధనం కంటే ఎక్కువ భద్రంగా పేర్చారు. అంతగా చదువులేని ప్రజలు పురాతన వస్తువులను పనికిమాలి నవిగా భావిస్తారు. అదే పురావస్తు శాస్త్రజ్ఞుల దృష్టిలో ఆ వస్తువులు అత్యంత విలువైనవి.చదువు లేని ప్రజలకు వాటి విలువ తెలియదన్న విషయాన్ని గురజాడ మనకు ఈకథలో చెప్పకనే చెప్పారు. ఆ ఊరులో జంగాలు పూజించే పాలరాతి బుద్ధ ప్రతిమ గురించి ఊరంతా గొప్పగా చెప్పుకొనేవారు. అది బహు సొగసైనది. అంత సొగసైన చిత్రం గాంధార దేశం వైపు తప్ప మరెక్కడా చూడలేదని దొర అంటాడు. ఆ పాలరాతి విగ్రహంపై బౌద్ధ సిద్ధాంతాలు సొంపుగా వ్రాయబడి ఉన్నాయి. దొరగారి మనసు ఆ పాలరాతి విగ్రహం వైపు మళ్ళింది. ఆ విగ్రహాన్ని తనకు ఇమ్మనమని దొర కోరాడు.  శైవులలో పెద్దలకు ఆగ్రహం
కలిగింది. అయినా దొరపైనున్న గౌరవంతో శైవ పెద్దలు చాలా సున్నితంగా తి‌రస్కరిస్తారు. అంతటితో ఆ ప్రయత్నం దొరగారు విరమించుకున్నారు. ( సశేషం )