ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
గురజాడ రచన : శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్ : 701 3660 252.
August 26, 2020 • T. VEDANTA SURY • Memories

శాస్త్రులవారు కథ చెప్పమంటే శాయన్న భుక్త  కథ చెప్పడం ప్రారంభిస్తాడు. ఆ కథ ఏమిటంటే    "  రామగిరి గ్రామంలో శైవ, వైష్ణవ  మతాలకు శత్రుత్వం చిరకాలంగా ఉంది. శివమతానికి మొనగాడు, పాలరాతి బుద్ధ ప్రతిమ దొంగిలించి దొరకు అమ్మబోయి అతనిచే తిరస్కరింపబడిఊరు వదలి పారిపోయిన పూజారే జంగం శరభయ్య. ప్రతిమను దొంగతనం చేసి పలాయనం చిత్తగించే వరకూ అతడు గ్రామ ప్రజల దృష్టిలో అతగాడు సాక్షాత్తు నందికేశ్వరుడి  అవతారమని  రాత్రుళ్ళు  గృహ  యెదుట వృషభరూపమై మేస్తూ ఉంటుందని ఇక్కడ జంగాలకు, దేవాంగులకు విశ్వాసం.ఆదొర బుద్ధ విగ్రహాన్ని కావాలని కోరినందునఊరిలో కొందరు శైవమత పెద్దలకు కోపం వచ్చినా ఆ దొరక్రిందటి జన్మలో పరమ మహేశ్వరుడైన కారణంగా ఆ విగ్రహమును కోరినాడనీ,భక్తవాత్సల్యంచేత శివుడిచ్చిన శలవును 
అనుసరించే శరభయ్య విగ్రహాన్ని పెరుక్కు వెళ్ళాడనీ, దొరఉంటున్న డేరా నుంచి శరభయ్య పారిపోవడంతో వృషభరూపం ధరించి , రంకెవేసి మరీ దాటేసాడనీ, అప్పుడే అతని శిష్యులు పుట్టించారు. శరభయ్య నేడో, రేపో  వీరాసనం వేసుకుని ధ్యానం చేస్తూ కొండ మీదనో, గోపురం మీదనో ఆవిర్భవిస్తాడు. శివభక్తులు బాజా బజంత్రీలతో వెళ్ళి సంతోషంతో అందరూ మోసుకు వస్తారు. ఆ పైన కంసాలి 
వీరయ్య ఆ కథకు చిలువలూ పలవలూ అల్లి ద్విపద కావ్యంవ్రాసి అచ్చు వేయిస్తాడనీ, ఇరువురి (శ‌రభయ్య,దొర)  కీర్తి  నలు  దిక్కుల వ్యాపింపజేస్తారు అంటాడు శాయన్న. ఏమి మూఢభక్తి అని శాస్త్రులవారు ఆశ్చర్యపోతారు. ఇంతలో వెంకయ్య ఏదో అనబోతాడు. ఒక శిష్యుడు అడ్డుపడి అతనిని వారించి ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళను చెప్పనివ్వు అంటాడు. శాయన్న మరల కథ చెప్పడం ప్రారంభిస్తూ 
" పామరులకుండే గాఢభక్తి పండితులకుండదు గానీ ఈ మూఢభక్తి ఒకప్పుడు ప్రాణాంతకం అవుతుంది."అన్నాడుశాయన్న. ( ఇక్కడ గురజాడవారు మూఢుల మనస్థత్వంపైసరియైన, నిగూఢమైన అవగాహనతోనే ఉన్నారనిపిస్తుంది. శరభయ్య, దొర పై వారికున్న మూఢ భక్తి  వారిని ఎన్ని విధాలుగా ఆలోచింపజేసిందో చూడండి. నిజానికి శరభయ్యపూజారి ముసుగులో నున్న దొంగగా మనం భావించాలి.
 కానీ అతనంటే పామర జనానికి వల్లమాలిన అభిమానం.     ఇక్కడ గురజాడవారు మూఢుల నైజం ఎలా ఉంటుందో తెలియజెప్తాడు.  మూఢులకు ఒక వ్యక్తిపై  అమితమైన అభిమానం  కలిగి ఉన్నప్పుడు ఆ వ్యక్తి  ఎన్ని తప్పుడు పనులు చేసినా అందలానికి  ఎత్తేస్తారు.  అలానే  అదే  వ్యక్తిపై అమితమైన  అసహ్యత కలిగిందనుకోండి ఆ వ్యక్తిని  అతఃపాతాళానికి తొక్కేస్తారు. ఇది మూర్ఖుల సహజ గుణం  ఏ మార్గాన్ని వాళ్లు ఎంచుకుంటే ఆ మార్గాన్ని ప్రోత్సాహించు కొనేందుకు  అనేకమైన కారణాలు చెబుతారు. అవి పది మందికీ అంగీకారయోగ్యంగా ఉన్నాయా లేదా అని ఎవరూ ఆలోచించరు.) శాయన్న తన కథను కొనసాగిస్తూ ----" శివ స్థలం యొక్క ఉత్పత్తి మీకుతెలుసనీ, పూజారి శరభయ్య చాలా కథకుడనీ, ఆకారణంగా అతని రోజుల్లోశివస్థలానికి మిక్కిలి వైభవం కలిగింది. చుట్టుపక్కల గ్రామాలవాళ్ళందరూ మొక్కుబడులు చెల్లిస్తారు. ఇక్కడదేవాంగులు బాగా డబ్బున్నవాళ్ళు.అంతేకాదు.జంగంపాడు యావత్తూను, దేవరపేట యావత్తూను శరభయ్య మాటమీద నడుస్తారు. ఆ కారణంగా ఉత్సవపు రోజుల్లో పెద్ద పెద్దజాతర్లు సాగుతాయి. ఇక ఈ గ్రామంలో ఉండే విష్ణు స్థలంగురించి చెప్పడం మొదలు పెడతాడు శాయన్న భుక్త. తరువాత సంచికలో..(  సశేషం )