ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
గురజాడ రచన : శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్ : 701 3660 252.
August 28, 2020 • T. VEDANTA SURY • Memories

శాయన్న ' రామగిరి' గ్రామానికి చెందిన కథను చెబుతూఆ ఊరు నాయలు బాగా డబ్బున్నవాళ్ళు. అందులో సారథనాయుడు లక్షాధికారి (ఆనాడు లక్షాధికారి అంటే ఈరోజుల్లో కోటీశ్వరుని క్రిందే లెక్క).అతని బావమరిది గ్రామమునసబు.అన్ని రకాల గుణాలు కలిగినవాడు. ఆ తాలూకా మొత్తంపైఅతి పెద్ద సారాకొట్టు ఈ ఊరులోనే ఉంది. అంత గొప్పదైన ఊరు.  కొన్ని సంవత్సరాల క్రితం దక్షిణ దేశం నుంచి ఒక అయ్యవార్లు వచ్చి సారథి నాయుడుకీ, అతని బావమరిది రామినాయుడుకీ (మునసబు), ఆ ఊరులో గల ఇతరులకీ, చక్రాంకితం చేసి, వైష్ణవమిచ్చారు. నాయుళ్ళంతా వైష్ణవం   పుచ్చుకొని  శివకోవిల వైపు కనీసం కన్నెత్తి చూసేవారుకాదు.శివభక్తుడైన శరభయ్యకు కన్నుకుట్టింది.అందుకు ఆలోచించిఅతడు ఒక పథకం వేసాడు. హైదరాబాద్ రాజ్యం నుంచి కొందరు దేశ సంచారార్థం ఈ ప్రాంతానికి వచ్చి, రామగిరి కూడా వచ్చారు. అలా వచ్చేటప్పుడు శివపీఠంతోను, ప్రభలతోనూ, రుంజలతోనూ పెను ప్రళయంలా దిగబడ్డారు .రోజూఅర్థరాత్రి వేళ శివార్చన చేసేవారు. ఆసమయంలో శంఖాలు‌,జయఘంటలు, ఢమామీల ధ్వనులు పామరుల గుండెల్లో
భయోత్పాతం పుట్టించేవి. అక్కడ ఉన్న నల్లరాతి కొండల్లోఆ ధ్వనులకు ప్రతిధ్వనులు కలిగి కోలాహలంగా ఉండేది. ఈ అట్టహాసాన్ని చూసి వైష్ణవం పుచ్చుకొన్న  నాయుళ్ళు ఒక్కొక్కరూ శైవంలో చేరి విభూది, రుద్రాక్షధారణ చెయ్యడం మొదలు పెట్టారు. సారధినాయుడుని వైష్ణవం నుండి శైవమతం వైపు లాగడమే శివాచార్ల ముఖ్య ఉద్దేశంగా ఉండేది.ఆకారణంగా ఒక రోజున వారు గుండం తొక్కడానికి పెద్దప్రయత్నం చేసారు. శైవులలో ముఖ్యమైన వారంతా రుంజల తో  సా‌రథి నాయుడు ఇంటికి వెళ్లి ఉత్సవం చూచుటకు 
తప్పనిసరిగా రాకతప్పదని మరీమరీ కోరారు. ఇది చూసినఅయ్యవార్లు ఏమన్నారంటే   " రాముని ఆజ్ఞ ఎలా ఉంటేఅలా జరుగుతుంది. కాశీలో మృతిచెందినవారికి శివుడేకదా తారకమంత్రోపదేశం చేస్తాడు. ఏ మతమైనా ప్రవృత్తికలవాడికి త్రోవ ఉంటుంది. అదిలేకుంటే వైష్ణవుడైనా కార్యంలేదు. '' అని.  (ఇక్కడ అన్ని మతములు సమానమేనన్నభావన గురజాడ ప్రభోదించారు.) సారథినాయుడుని గుండం చూడటానికి ఎలాగైనా వెళ్లనీయకుండా చేయాల న్నదే అయ్యవార్ల కోరిక. అందుకు ప్రతిగా అయ్యవార్లు కూడా గుండం ఏర్పాట్లు చేసి, ' మనవాళ్ళయ్య' ను రాగి ధ్వజం చేతబట్టి, నాలాయిరం పఠిస్తూ ఆ నిప్పు కనికలలో దిగి నడిస్తే బాగుంటుంది అనే ఆలోచన చేస్తారు. అందుకు మనవాళ్ళయ్యనే పూనుకోమంటారు అక్కడున్నవాళ్ళు. కానీ మనవాళ్ళయ్య  నోరెళ్ళ బెడతాడు. కొంతసేపు వాదోపవాదాలు జరిగిన తరువాత మనవాళ్ళయ్య రంగాచార్యుల వద్దకు వెళ్ళి జరిగిన విషయం చెప్పి ఉత్సవ విగ్రహాన్ని ఇమ్మని వేడుకుంటాడు. గుండం తొక్కడమనేది వైష్ణవ మత నిషిద్ధం. వైష్ణవ మత గ్రంథాలలో ఎక్కడా అగ్ని గుండం తొక్కే ప్రక్రియలేదు. ఉత్సవ  విగ్రహాలు శూద్రులు ముట్టుకోవలసినవికావు. ముట్టుకుంటే కళ్ళు పేలిపోతాయి.'' అని రంగాచార్యులు అనేసరికి బ్రతుకు జీవుడా అనుకొని మనవాళ్ళయ్య లోలోన సంతోషించాడు. అగ్ని గుండం తొక్కడానికి రంగాచార్యులవారినే రమ్మని కోరదాం అంటాడు మనవాళ్ళయ్య.అందుకు గ్రామమున్సబు రామినాయుడు  అందుకు అంగీకరించక ముసలాయనకు బదులుగా వాళ్ళ అబ్బాయి కృష్ణమాచార్యులను అగ్నిగుండం మట్టించేందుకు తీసుకువెళ్దామంటాడు. ఆమాటలు కృష్ణమాచార్యుల చెవిని పడ్డాయోలేదో అతడు అటుకెక్కి పోతాడు. కొడుకుకు బదులుగా తండ్రి రంగాచార్యులే అగ్నిగుండం తొక్కడానికి వచ్చారు. ఒక రావిచెట్టు చాటునుండి ఒక్కసారిగా వెలుతురు వచ్చింది. ఒక చేత కరదీపము,  రెండవ చేత సూరకత్తి  కట్టుకొని, జుట్టు విరబూసుకొని  నిబ్బరంగా అడుగులు వేసుకుంటూ వచ్చి మామగారి పక్కన నిల్చుని, నాయల వైపు బాకు చూపింది నాంచారమ్మ. హటాత్తుగా వచ్చిన వీ‌రరూపము జూచి అందరూ భీతిల్లారు. మనవాళ్ళ య్యతో సహా అందరూ బెదిరి దూరమయ్యారు. తన మామ గారి పేరు స్మరిస్తూ గుండం తొక్కుతాను ధైర్యం ఉన్న వైష్ణవు లను తన వెంట రమ్మంది. కానీ ఎవరూ ముందుకు రాలేదు. నాంచారమ్మ అందరినీ కలియజూసి పీరు సాయిబు గురించి అడిగింది. వెంటనే ఆమె ముందుకు సాయిబు  ఎంతో వినమ్రంగా వచ్చి నిలుచున్నాడు. నాంచారమ్మ అతనిని చూసి పీరుసాయీబు దూదేకుల సాయిబు అయినప్పటికీ, రామభక్తుడు,కీర్తనలు చెబుతాడు.హటయోగం అభ్యసి స్తాడు.  ఏటి ఒడ్డున తోటలో గల మఠం ఇతనిదే. ఇతనికి శిష్య బలగం అధికంగా ఉన్నారు అని ఆమె  చెబుతోంది. అక్కక  ఉన్నవారందరికీ వివిధ మతాల గురించి నాంచా రమ్మ వివరించి చెబుతోంది." శివుడూ,విష్ణూ పీర్లే అయిన  ప్పుడు బుద్ధుడు శివుడు కారాదా ? " అని శాయన్నభుక్త కథ పరిసమాప్తం చేసాడు. ఏ పేరుపెట్టినా ఆ పరమాత్మ
ఒక్కడే. ఈమాత్రం దానికి మత విద్వేషాలు  పెంపొందిం చుకుపోవడం సరిఅయిన పద్ధతికాదు. అందరూ కలసి ఒకదగ్గర పూజచేసు కోవచ్చు. సర్వమత సమానత్వాన్ని  గురజాడవారు ఈకథలో ప్రభోదిస్తాడు. గురజాడవారి కథలు ఎన్నిసార్లు చదివినా  ఇంకా  చదవాలనిపిస్తూంది.  20వ శతాబ్ద ప్రారంభంలో ఉన్న  ఆధునిక భాష పద్ధతులు, ప్రజల జీవన విధానం, మూఢనమ్మకాల గురించి  గురజాడవారి కథల ద్వారా తెలుసుకోగలుగుతాం. ఈనాటితో  గురజాడ  వారి కథల ప్రస్థావన ముగిసింది. నా ఆత్మకథలో
భాగంగా ఈకథలు నిలవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. రేపటి నుండీ "గురజాడవారి సూక్తులు" తెలుసు కుందాం ! ( సశేషం )