ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
గురజాడ రచన : శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్ : 701 3660 252.
August 27, 2020 • T. VEDANTA SURY • Memories

శాయన్నభుక్త  రామగిరి గ్రామంలో గల విష్ణు స్థలంరెండు వందల యేండ్ల క్రిందట ఈ దేశాన్ని పరిపాలించే ఒకమహరాజు నిర్మించి రాగభోగాలకు ఈ  గ్రామాన్ని స్వామికిసమర్పణ చేసాడు. అప్పటి నుండీ రంగాచార్యులు గారి కుటుంబస్తులే ఈ స్థలానికి ధర్మకర్తలై ఉంటూ వచ్చారు.  రంగాచార్యులుగారు బహుయోగ్యులు.ద్రవిడ వేదములోను, సంస్కృత సాహిత్యంలోను గట్టివారని ప్రసిద్ధి. ఆయనకు
కృష్ణమాచార్యులు అనే కుమారుడు ఉండేవాడు. అతడు సంస్కారేకాని విశేష ప్రయోజకుడుకాడు. అయినా రంగాచార్యులు కోడలు, క్రిష్ణమాచార్యులు భార్య నాంచారమ్మ  చాలా ఉత్తమమైనది. రూపానికి రూపం, సదృశమైన గుణసంపత్తి ఆమెలో గలదు. ఆమెకు ఒక కుమార్తె, కుమారుడుఉన్నారు. ఇంటినీ, దేవాలయాన్ని ఆమే చక్కబెడుతుంది.అత్తవారింటికి  వెలుగును  తెచ్చింది.  పురాణములను నాంచారమ్మ చదివినంత శ్రావ్యంగాను, రసంతోనూ ఎవరూ చదువలేరు. తల్లిదండ్రులు పండితులు. వారు  ఆంధ్ర గీర్వాణము లందు మంచి పరిజ్ఞానము సంపాదించిరి " అని చెబుతారు. రంగాచార్యులవారి కుమారుడు క్రిష్ణమాచారి విశేష  ప్రయోజకుడుకాకపోయినప్పటికీ రంగాచార్యుల మేథాశక్తికి, సాహిత్య సంపత్తికీ సమానముగా తూగగలిగిన  కోడలును వియ్యంకుడు, వియ్యంకురాలను ఆ ఇంటికి సమకూర్చడం  కుటుంబ విలువలకు సమానమైన పాత్రలను సృష్టించడం గురజాడ వారి గొప్పతనానికి నిదర్శనం. శాస్త్రిగారి గతకాలపు శిష్యుడు వెంకయ్య శాయన్న భుక్త చెప్పినది విశ్వసించక  కవిత్వమా ? కవిత్వమా ? అని ప్రశ్నిస్తాడు. అందుకు సమాధానంగా శాయన్నభుక్త "  మాకూ వాళ్లకూ రాకపోకలు గలవు.నా భార్య చెప్పిన మాటలు నేను చెబుతున్నాను. నేను కూడా విన్నాను. విష్ణు స్థలం యొక్క స్థితి ఇది.  గానీ అయ్యంవార్లంగారు మత సంబంధమైన తగాదాలలో ఎన్నడూ కలుగజేసుకోలేదు. ఇక్కడ మత సామరస్యాన్ని  మనం చూడగలం. వైష్ణవ పక్షానికి ముఖ్యమైనవాడు  'మనవాళ్ళయ్య.'   ఇతను స్థూల కాయుడు.  రోజూ పొద్దున్న  ఉపాదానాకు  వచ్చి,  స్తోత్ర పాఠాలతో ఆ ప్రాంతాన్ని  ఊదరగొట్టేస్తాడు. ఒకనాడు తెల్లవారున ' మనవాళ్ళయ్య'  ఎప్పటిలా ఉపదానాకు వస్తున్నాడు. అదే సమయంలో కలెక్టరుగారు గుర్రమెక్కి వస్తున్నారు. స్థూలకాయుడైన 'మనవాళ్ళయ్య'  బఱ్ఱెనామా లు  పెట్టుకుని, రాగి ధ్వజంతో  అతను కోలాహలం చేసుకుంటూ గుర్రానికి ఎదురై  ఫెళఫెళ మని శ్లోకం ఎత్తుబడి చేసేసరికి కోలాహలం చూసి గుర్రంబెదిరిపోయింది.కలెక్టరుకు కోపం వచ్చింది.మనవాళ్ళయ్యకు కలెక్టర్ అయిదు రూపాయలు జరీమానా వేసా‌రట. ఈ కథ శుద్ధ అబద్ధమనీ, మనవాళ్ళయ్యచే శ్లోకాలు చదివించి  దొరగారు అయిదు రూపాయలు ప్రెజెంటేషన్ ఇచ్చారనీ, అవి పెట్టి  కొత్తగా పాత్ర కొన్నానని  ' మనవాళ్ళయ్య'  చెబుతాడు. ఇక్కడ ' మనవాళ్ళయ్య'  పేదరికంలో పుట్టినా తనకు తాను సర్థిచెప్పుకొని ఆత్మాభిమానాన్ని కాపాడుకునే పాత్రను గురజాడ సృష్టించారు. శైవులలో ఉన్న ఐక్యత వైష్ణవులలో లేదు. సాతాన్లలలో చాలామంది మనవాళ్లయ్య శిష్యులే ! అయినప్పటికీ అతనిని అతని శిష్యులు అవతారపురుషుడని చెప్పరు. అదే శైవమత భక్తులైతే శరభయ్యను( శైవమత పూజారి) అవతార పురుషుడని ఆకాశానికి     
ఎత్తేస్తారు. అందుకు మనవాళ్ళయ్యంటాడు " శరభయ్యే వృషభావతారమైనప్పుడు నేను గరుడాళ్వారి  వారి యొక్క అత్యల్పాంశ వల్లనైనా జన్మించి ఉండకూడదా?గరుడాళ్వారి నఖములయొక్క ( అంశం యొక్క) తేజస్సు నాయందు ఆవిర్భవించి ఉన్నదికాబట్టే, శరభయ్యను ఇలా చీల్చి పేల్చు  తున్నాను " అంటాడు. అయ్యవార్లంగారికి మనవాళ్ళయ్యఅన్న మాటలు తెలిసిపోయి నానా చీవాట్లు పెడతాడు. ఆ
చీవాట్లు తిని బయటకు వచ్చి తనలో తాను " ఈ బ్రాహ్మణు లది  జ్ఞానంకాదు. అజ్ఞానముకాదు. కడజాతి మనుషులే భక్తి ప్రభావం చేత ఆళ్వార్లు అయిఉండిరి కదా ! ఇంతకాల  మైంది రాముడి ధ్వజమును జయప్రదముగా మోస్తూ, శైవ సంహారం చేసిన నేను శ్రీ మద్గురుడాళ్వారి నఖాగ్రాగ్రం యొక్క అవతారమేలకాను ? " అనుకుంటాడు. ఇలా ఎవరిమతాన్నివారు అభిమానంగా చూసుకుంటూ తమకు తామే గొప్పవాళ్ళమనుకుంటారు.    (సశేషం )